Read News in Telugu Language
adsdaksha

మై ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ దాతృత్వం..

600 నోటు పుస్తకాల పంపిణీ

– సంస్థ సభ్యులను అభినందించిన ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు.

  1. తల్లాడ ( thallada )  మండలం అన్నారుగూడెం( annarugudem)  ప్రాథమిక పాఠశాల, నిమ్మగూడెం ప్రాథమిక పాఠశాల లో చదువుతున్న 160 మంది విద్యార్థులకు 600 నోట్ పుస్తకాలను బుధవారం మై ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ ఉచితం గా అందించింది. ఈ కార్యక్రమంలో తల్లాడ ఎంపీపీ దోడ్డా శ్రీనివాసరావు ,గ్రామ సర్పంచ్ మారెళ్ళ మమత పాల్గొని మాట్లాడుతూ

Read also : దేశ ఔన్నత్యాన్ని కాపాడాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉంది ..

Hospital

వివిధ ప్రాంతాలలో పనిచేస్తున్న ఉద్యోగులు అందరూ కలిసి హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేసినటువంటి మై ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ సంస్థ ద్వారా విద్యార్థులకు నోటు పుస్తకాలను అందించటం అభినందనీయమని వక్తలు అన్నారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు తమ ఆదాయం నుండి కొంత భాగాన్ని ఈ విధంగా స్వచ్ఛంద కార్యక్రమాలకు నిర్వహించటం అభినందనీయమని వక్తలు అన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు నోటు పుస్తకాలను అందించి ప్రభుత్వ విద్యా రంగానికి చేయూత అందించడం అభినందనీయం అని వక్తలు అభిప్రాయపడ్డారు.

Read also : పొంగులేటి క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ..

కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు ,గ్రామ సర్పంచ్ మారెళ్ళ మమత ,ఎంపీటీసీ గోవింద్ విజయలక్ష్మి ,ఉప సర్పంచ్ గోవిందు భాగ్యమ్మ ,జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. రమేష్ ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు సరోజిని, పోలూరు వెంకటేశ్వరరావు , మై ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ ప్రతినిధి , ఉపాధ్యాయులు మాధినేని నరసింహ రావు ,పులి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.