Read News in Telugu Language
adsdaksha

ఆధార్‌తో ఆస్తుల అనుసంధానమై, కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశం….

దక్ష న్యూస్, న్యూ ఢిల్లీ: డిసెంబర్ 21

దేశంలో ప్రతీ ఒక్కరి ఆస్తులను ఆధార్‌ ( aadhar ) అనుసంధానం చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌)పై ఢిల్లీ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్రానికి కీలక ఆదేశాలను జారీ చేసింది.

Read also: రామమందిర ప్రారంభోత్సవం కు 108 అడుగుల అగరబత్తీ తయారీ !

కాగా, విచారణ సందర్బంగా ప్రతీ ఒక్కరి స్థిర, చరాస్తులను ఆధార్‌తో అనుసంధానం చేసే విషయాన్ని పరిశీలించి మూడు నెల్లలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఇక, ఇదే సమయంలో పిటిషనర్ లేవనెత్తిన అంశాలను విజ్ఞాపనగా తీసుకోవాలని కేంద్రానికి సూచించింది.

Hospital

Read also: CEC Bill: ఎన్నికల కమిషనర్ల నియామకం బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..

అయితే, అవినీతి, నల్లధనం ఉత్పత్తి, బినామీ లావాదేవీలను అరికట్టేందుకు పౌరుల చర, స్థిరాస్తి పత్రాలను వారి ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోరారు.

దీంతో, జస్టిస్ రాజీవ్ శక్ధేర్, జస్టిస్ గిరీష్ కత్పాలియాలతో కూడిన డివిజన్ బెంచ్ కేంద్రాన్ని పైవిధంగా ఆదేశించింది.

Leave A Reply

Your email address will not be published.