Read News in Telugu Language
adsdaksha

ఆధార్ అప్డేట్‌కు గడువు పెంపు .. మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్టు వెల్లడి ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : మార్చి 12

ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు ప్రజల నుంచి భారీగా రెస్పాన్స్ వస్తుండడంతో ఉడాయ్ ( uidai ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్‌ ( aadhar ) ను మరో మూడు నెలల పాటు ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు గడువు పొడిగించింది. నిజానికి ఉచితంగా ఆధార్ అప్డేట్‌కు ఈనెల 14తో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో జూన్ 14 వరకు ఉచితంగా ఆధార్‌లో మార్పులు చేసుకునే వెసులుబాటు కల్పించింది.

Hospital

read also : ముగిసిన మంత్రి వర్గ భేటీ.. 4లక్షల 50వేల ఇండ్ల కు 22,500 కోట్లు విడుదల చేస్తూ నిర్ణయం..

వాస్తవంగా 2023 మార్చి 15 వరకు ఉన్న గడువును డిసెంబరు 14 వరకు పొడిగించింది. అనంతరం 2024 మార్చి వరకు ఆధార్ అప్డేట్‌కు అవకాశం కల్పించింది. తాజాగా మరోసారి జూన్ 14 వరకు గడువు తేదీని పొడిగించడం గమనార్హం. ఆధార్ అప్డేట్ కోసం ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉడాయ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదే సమయంలో ఆధార్ కార్డు తీసుకుని 10 సంవత్సరాలు పూర్తయిన వారు తమ డెమోగ్రఫిక్ వివరాలు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

 

Leave A Reply

Your email address will not be published.