Read News in Telugu Language
adsdaksha

బీఆర్ఎస్ కు మరో ఎదురుదెబ్బ.. వరంగల్ జిల్లా యువనేత దాస్యం అభినవ్ రాజీనామా..

దక్ష న్యూస్, వరంగల్: ఫిబ్రవరి 8

పదేండ్ల పాటు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన నేతలు కారు దిగిపోతున్నారు. తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. మొన్న మాజీ మంత్రి, స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆ పార్టీకి రాజీనామా చేయగా తాజాగా మరో యువనేత పార్టీకి రాజీనామా చేశారు.

Hospital

Read also: 15 రోజుల్లో 15వేల పోలీసు ఉద్యోగాలు .. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది : సీఎం రేవంత్ రెడ్డి .

మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ సోదరుడు ప్రణయ్ భాస్కర్ కుమారుడు అభినవ్ భాస్కర్ బీఆర్ఎస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 60వ డివిజన్ కార్పొరేటర్‌గా ఉన్నారు. త్వరలో బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటన చేశారు. తనకు విలువ లేనిచోట ఉండలేక రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఇదీలా ఉండగా నేడు (గురువారం) అభినవ్ భాస్కర్ బీజేపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.