Read News in Telugu Language
adsdaksha

రూ.3లక్షలు లంచం తో పట్టుబడ్డ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్..

దక్ష న్యూస్, నల్గొండ : ఫిబ్రవరి 16

నల్గొండ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోదక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. మెడికల్ బిల్లులు చెల్లించడానికి సూపరింటెండెంట్ లచ్చునాయక్ కాంట్రాక్టర్ ని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. గురువారం తన ఇంట్లోనే లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు.

Hospital

Read also: హెచ్.సీఏ మహిళ హెడ్ కోచ్ సస్పెండ్.. మహిళా క్రికెటర్లపై వేధింపుల ఆరోపణలు..

నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి మందులు సప్లయ్ చేసే కాంట్రాక్టర్ రాపోలు వెంకన్న నుంచి హాస్పిటల్ సూపరింటెండెంట్ లచ్చు నాయక్ రూ.3 లక్షల లంచం డిమాండ్ చేశాడు. అయితే లచ్చు నాయక్ తనను ఇబ్బంది పెడుతున్నాడని కాంట్రాక్టర్ వెంకన్న ముందుగానే ఏసీబీ అధికారులను సంప్రదించాడు. దీంతో పథకం ప్రకారం లచ్చు నాయక్ ఇంట్లో కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కాగా సూపరింటెండెంట్ లచ్చు నాయక్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు.

Leave A Reply

Your email address will not be published.