Read News in Telugu Language
adsdaksha

ఏసీబీ కి చిక్కిన జూపార్క్ ఆఫీసర్.. 5వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రమేశ్ ..

దక్ష న్యూస్: హైదరాబాద్ : మార్చి 15

జూపార్క్ సీనియర్ అసిస్టెంట్ సరాఫ్ రమేశ్ రూ.5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ ( acb ) కి పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సైదాబాద్‌ ( saidabad ) కు చెందిన మహ్మద్‌ ఆజం షరీఫ్‌ కుటుంబం కొంతకాలంగా జూలో పనిచేస్తోంది. షరీఫ్ తన తల్లి పేరు మీద ఉన్న కుటుంబ పింఛన్ ను తన సోదరి పేరుకు మార్చాలని జూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. పెండింగ్‌లో ఉన్న ఫైల్ జూపార్క్ సీనియర్ అసిస్టెంట్ సరాఫ్ రమేశ్ వద్ద పెండింగ్ పెట్టడంతో షరీఫ్ ఆయనను కలిశాడు. ప్రాసెస్ చేయమని అడిగితే రమేశ్ రూ.5 వేలు లంచం డిమాండ్ చేశాడు.

read also : పటాన్ చెరు ఎమ్మెల్యే సోదరుడి అరెస్ట్ ..

Hospital

షరీఫ్ ఏసీబీని ఆశ్రయించడంతో రమేష్‌పై గురువారం నిఘా పెట్టారు. షరీఫ్ నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. అవినీతి అధికారులకు సంబంధించిన సమాచారాన్ని 1064 టోల్ ఫ్రీ నంబర్ లేదా నేరుగా ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ సూచించారు.

read also : tspsc : గ్రూప్ 1 దరఖాస్తుల గడువు పెంపు .. ఈనెల 16 వరకు పెంచిన టీఎస్పీఎస్సీ..

Leave A Reply

Your email address will not be published.