Read News in Telugu Language
adsdaksha

రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఎమ్మార్వో.. రైతు నుంచి పది లక్షలు లంచం డిమాండ్..

దక్ష న్యూస్, హైదరాబాద్ : ఫిబ్రవరి 13

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా శామీర్ పేట్ ఎమ్మార్వో లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. తహసీల్దార్ సత్యనారాయణ ఏసీబీ ( acb ) కి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. భూమి రిజిస్ట్రేషన్ కోసం రైతు నుంచి మంగళవారం 10 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయన్ను పట్టుకున్నారు. తహసీల్దార్ ఆదేశాల మేరకు ఆయన డ్రైవర్ భద్రి రామశేషగిరి రావు అనే వ్యక్తి నుంచి 10 లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఏసీబీ అధికారులు డ్రైవర్ భద్రితో పాటు తహసీల్దార్ సత్యనారాయణను అదుపులోకి తీసుకొని విచారించగా లంచం తీసుకున్నట్టు అంగీకరించారు.

Hospital

read aalso : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కారుకు ప్రమాదం.. కారు ఢీకొని హోంగార్డు మృతి ..

తన పేరు మీద భూమి పట్టా చేయాలంటే తహసీల్దార్ రూ. 10లక్షలు డిమాండ్ చేయడంతో రామశేషగిరి రావు అనే వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. గతంలో పది లక్షలు అందజేయగా… అనంతరం 20లక్షల చెక్కును కూడా ఇచ్చినట్లు బాధితుడు తెలిపారు. ఇప్పుడు తాజాగా మరో పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయగా అతను ఏసీబీని ఆశ్రయించాడు. సత్యనారాయణ డ్రైవర్ బద్రి డబ్బు తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆయన తీసుకోమంటేనే డబ్బు తీసుకున్నట్లు డ్రైవర్ అంగీకరించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.