Read News in Telugu Language
adsdaksha

భేదాల మధ్య సామూహిక సామరస్యం..

దక్ష న్యూస్, ఆధ్యాత్మికం : మే 16

భారతదేశం విభిన్న సంస్కృతులు, మతాలు, సంప్రదాయాల సమ్మేళనం. ఈ దేశపు సామూహిక సామరస్యం దాని గుర్తింపులో అంతర్భాగంగా ఉండి సామాజిక సమ్మేళనానికి మూలస్తంభంగా పనిచేస్తుంది. ఇటీవల, మన ప్రధాన మంత్రి ఒక ఇంటర్వ్యూలో, దేశంలోని ముస్లిం మైనారిటీల భవిష్యత్తు గురించి చెపుతూ భారతీయ సమాజంలో ఏ మతపరమైన మైనారిటీ పట్ల వివక్ష లేదని ఉద్ఘాటించారు.

మతం పేరిట అనైక్యతను పెంపొందించే విద్వేషపూరిత ప్రేరేపకుల ప్రయత్నాల మధ్య, జార్ఖండ్‌లోని గిరిదిహ్ జిల్లాలో హృదయాన్ని ద్రవింప చేసే చిన్న ఘటన మత సామరశ్యాన్ని గుర్తుతెస్తుంది.

గిరిదిహ్ జిల్లాలో నివసించే ఒకేఒక హిందూ నివాసి జాగో రవిదాస్ అంతిమ సంస్కారాలు ఆ గ్రామ ముస్లిం బృందం నిర్వహించింది. వారు ‘రామ్ నామ్ సత్య హై’ అని నినాదాలు చేస్తూ, హిందూ ఆచారం ప్రకారం అతని అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ముస్లిం గ్రామస్థులు ప్రదర్శించిన కరుణ, ఐక్యత మతపరమైన సరిహద్దులను దాటి, వర్గాల మధ్య అచంచలమైన బంధాన్ని ఎత్తిచూపింది. ఈ సంఘటన విస్తృతమైన గుర్తింపు, ప్రశంసలను అందుకుంది. పెరుగుతున్న అసహనం, మతపరమైన ధ్రువణత యొక్క సవాళ్లు ఉన్నప్పటికీ ఇది ఈ దేశంలో ప్రబలంగా ఉన్న ఐక్యత, సోదరభావం స్వాభావిక స్ఫూర్తిని ప్రదర్శిస్తుంది.

read also : బహు ముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ ఆయేషా సుల్తానా ..

Hospital

విభజన, ద్వేషం ప్రధానాంశాలుగా కనిపించే ప్రపంచంలో, కేరళలోని రాజన్, కథ మత సామరస్యాన్ని, కరుణ యొక్క శక్తినీ ప్రకాశించే ఉదాహరణ.

రాజన్ ఒక సంచారి. అతడి దీనావస్థని చూసిన రోడ్డు పక్కన తినుబండారషాపు యజమాని మహమ్మద్ కరుణతో రాజన్‌కు ఆహారం సహాయం అందించి అతని ఇంటికి తీసుకెళ్లాడు. రాజన్ క్రమంగా మహ్మద్ కుటుంబంతో కలిసిపోయాడు. మహమ్మద్ తన కుటుంబ సభ్యుల మాదిరిగానే అతనిని ప్రేమ గౌరవంతో చూశాడు. రాజన్ కథ మన తోటి మానవులపట్ల ప్రేమ, కరుణ కలిగి వుండడం యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేస్తుంది.

విభజన, రాజకీయ వైరుధ్యాల వాతావరణం మధ్య, పైన పేర్కొన్న భారతదేశపు స్వాభావిక ఐక్యతను ప్రదర్శించే కథలు ఐక్యత కరుణకు ఉదాహరణలుగా నిలుస్తాయి.

ఇవి ద్వేషంతో నడిచే కథనాలకు వ్యతిరేకంగా నిలుస్తాయి. కనుక ప్రజలు విద్య, అభ్యున్నతిపై దృష్టి పెట్టి, అసహనం ఆనవాళ్లను త్యజించాలి. విభజన కంటే ఐక్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని, అసహనపు నీడలను అధిగమించి కరుణపై స్థాపించబడిన సమాజం వైపు మార్గాన్ని అనుసరించాలి. అది అసహనం, మత ఏకీకరణ సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్న వారికి చెంపపెట్టులాంటిది.

Leave A Reply

Your email address will not be published.