Read News in Telugu Language
adsdaksha

ఉదయం నిద్ర లేవగానే చేతులు రుద్ది కళ్ళకు అద్దుకుంటారు..ఎందుకు…?

దక్ష న్యూస్, ఆధ్యాత్మికం.

మానవుని ఆధునిక శాస్త్ర జ్ఞానము అంతగా అభివృద్ధి చెందని కాలములో ఋషులు , మునులు అన్ని ఆరోగ్య సూత్రాలను ఆధ్యాత్మికంగా రూపొందించారు . వైద్య రంగము అంతగా అభివృద్ధి చెందని కాలంలో శుచి , శుభ్రత , వ్యాధి నిరోధకత అన్నీ దైవకార్యాలరూపంలో ఉండేవి . పుణ్యము , పురుషార్ధము వస్తుందంటే సామాన్యప్రజలు అనురిస్తాననేదే ముఖ్యాంశము. “అది చేస్తే ఆరోగ్యము … ఇది చేస్తే అనారోగ్యము— అలా చెబితే చాదస్తము గా కొట్టిపారేస్తారు” కాని అందులో ఎంతో ఆరోగ్యం, ఉత్సాహం దాగిఉన్నాయి.

read also : గోత్రం లోను సైన్స్ ఉంది.. అదేంటో తెలుసుకోండి..

ఉదా:- నిద్రలేవగానే రెండుచేతులు రుద్దుకొని కళ్ళకు అద్దుకుంటే చేతులలోని ఉష్ణశక్తి , వేడి కళ్ళకు తగిలి కళ్ళలోని రక్త ప్రసరణ ఎక్కువై ఆరోగ్యవంతంగా తేజోవంతము గా ఉంటాయి. కళ్ళజబ్బులకు దూరముగా ఉండవచ్చును. కళ్ళద్దాల అవసరము అంతతొందరగా రాదు. ఇది వైద్యశాస్త్రము చెప్పిన ఆరోగ్యసూత్రము.

read also : మధుర మీనాక్షి అమ్మవారి పాదుకల వెనుక వాస్తవ గాధ..

Hospital

కాని ఋషులు దీన్ని ఎలా చెప్పారంటే చేతులు రుద్దుకునేటప్పుడు బ్రహ్మ రాసిన చేతిగీతలు అనుకోకుండ చూడడం ద్వారా బ్రహ్మను పూజించినంత ఫలితము ఉంటుందని, బ్రహ్మజ్ఞానము కలుగుతుందని చెప్పారు. అలా ప్రతిరోజూ చేయడం వల్ల కోటి పుణ్యక్షేత్రాలు సందర్శించినంత పుణ్యము సంప్రాప్తిస్తుందని లింకు పెట్టేరు. ఏది ఏమైనా మనకు మేలు చేసే ఏ అలవాటయినా, పద్దతైనా మంచిదనుకున్నప్పుడు భక్తిగా ఆచరించడమే మేలు.

సేకరణ :- రమణీ మాణిక్యమ్మ
( పొదిల చూడామణి :
విశ్రాంత ప్రధానాచార్యులు)

 

read also : నిత్యపూజకు మట్టి ప్రమిదలు వాడరాదు.. దక్షిణ దిశ దీపంతో అరిష్టాలు..

Leave A Reply

Your email address will not be published.