Read News in Telugu Language
adsdaksha

ఖర్గే, పీయూష్ మధ్య వార్.. రాజ్యసభలో హాట్ హాట్ గా చర్చ..

దక్ష న్యూస్, న్యూ ఢిల్లీ: ఫిబ్రవరి 3

పార్లమెంటు సమావేశాల్లో భాగంగా శనివారం రాజ్యసభ హాట్ హాట్ సాగింది. బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఇటీవల నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ( aicc president mallikarjun kharge ), కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ( piyush goyal ) మధ్య మాటల యుద్ధం ప్రారంభం అయింది. ఖర్గే మాట్లాడుతూ బీహార్‌లో సీఎం నితీశ్ ఈ చేతితో రాజీనామా చేసి ఆ చేతితో మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారన్నారు. అదే జార్ఖండ్‌లో మాత్రం సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత పూర్తి మద్దతు ఉన్నా.. కొత్త ప్రభుత్వం ఏర్పడేందుకు 2 రోజుల సమయం పట్టిందని చెప్పారు. జార్ఖండ్‌లో అధికారంలోకి రావాలని బీజేపీ ఎన్ని కుతంత్రాలు చేసినా పని చేయలేదని విమర్శించారు. సీఎం పదవికి రాజీనామా చేస్తే కనీసం ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలనైనా గవర్నర్ కోరలేదంటే పరిస్థితి అర్థంఅవుతుందన్నారు. రాజీనామా ముందే హేమంత్ సోరెన్ శాసనసభా పక్ష నేతగా చంపయ్ సోరెన్‌ను ఎంపిక చేసినప్పటికీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు రెండు రోజుల సమయం పట్టిందని ఖర్గే విరుచుకుపడ్డారు. అయితే ఖర్గే వ్యాఖ్యలపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ స్పందించారు.

Hospital

Read also: 10న రాష్ట్ర బడ్జెట్.. రేపు కేబినెట్ భేటీ..

అవినీతి కాంగ్రెస్ డీఎన్‌ఏలోనే ఉందని, అందుకే మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా జైలుకు వెళ్లిన హేమంత్ సోరెన్‌ను కాంగ్రెస్ నేటికీ వెనకేసుకొస్తుందని ఎద్దేవా చేశారు. అవినీతి చేసినోళ్లకు మద్దతుగా నిలుస్తున్నారంటే.. కాంగ్రెస్ వైఖరి ఏంటో ప్రజలకు స్పష్టంగా తెలుస్తోందన్నారు. జార్ఖండ్‌లో గవర్నర్ నిబంధనల ప్రకారమే వ్యవహరించారని తెలిపారు. కాంగ్రెస్ నేతలు 2018లో సంతకాల ఫోర్జరీకి పాల్పడ్డారని ఆరోపించారు. ఎమ్మెల్యేల సంతకాలు ఫోర్జరీ చేసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని అడగడం కేవలం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని పీయూష్ గోయల్ కౌంటర్ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.