Read News in Telugu Language
adsdaksha

ఎయిరిండియా బంప‌ర్ ఆఫ‌ర్‌..తొలిసారి ఓటేసే వారికి విమాన టికెట్ల‌పై 19 శాతం రాయితీ..

దక్ష న్యూస్, ఇంటర్ నెట్ డెస్క్ : ఏప్రిల్ 18

కొత్త ఓటర్లను ప్రోత్సహించేందుకు ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది.
దేశంలో ప్రస్తుతం జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మొదటిసారి ఓటు వేసే ఓటర్లకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ( air india express ) విమాన టికెట్ల పై 19 శాతం రాయితీ ప్రకటించింది. 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉన్నవారు ఓటు వేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి వారి సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు విమాన టికెట్ల‌ను బుక్ చేసుకోవాలనుకునే వారికి టికెట్ పై 19 శాతం రాయితీ ఇస్తున్నట్టు వెల్లడించింది.

read also : రాసిపెట్టుకోండి రాహులే ప్రధాని ..విజయన్ కమ్యూనిస్టు కాదు.. కమ్యూనలిస్టు : వయనాడ్‌ రైతుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ..

Hospital

ప్రయాణికుడు ఓటు వేయబోయే నియోజకవర్గానికి సమీపంలో ఉన్న ఎయిర్‌పోర్టు తన గమ్యస్థానమై ఉండాలి. ఆఫర్‌ పొందడం కోసం ఓటర్‌ ఐడీ సహా సంబంధిత పత్రాలు చూపించాలి. దేశంలోని యువతను ఓటు వేసేలా ప్రోత్సహించడంతో పాటు ఏప్రిల్ 29న తన 19వ వార్షికోత్సవాన్ని పుర‌స్క‌రించుకుని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఈ ఆఫ‌ర్‌ను తీసుకొచ్చింది.

read also : Dehydration : ప్రమాదకరంగా పిల్లలలో డీహైడ్రేషన్.. జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు..

ఎక్స్‌ప్రెస్‌ లైట్‌, ఎక్స్‌ప్రెస్‌ వాల్యూ, ఎక్స్‌ప్రెస్‌ ఫ్లెక్స్‌, ఎక్స్‌ప్రెస్‌ బిజ్‌.. ఇలా నాలుగు కేటగిరీలకు ఈ ఆఫర్‌ వర్తిస్తుందని సంస్థ తెలిపింది. ఏప్రిల్ 18 నుంచి జూన్ 1 మధ్య ప్ర‌యాణించే తొలిసారి ఓటు వేసే యువతకు ఈ వెసులుబాటు కల్పించినట్టు తెలిపింది. ఈ మేరకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ డాక్టర్ అంకుర్ గార్గ్ ఓ ప్రకటనలో తెలిపారు. మన దేశ భవిష్యత్తును పెంపొందించడంలో యువతదే కీలక పాత్ర అని అంకుర్ గార్గ్ పేర్కొనారు.

Leave A Reply

Your email address will not be published.