Read News in Telugu Language
adsdaksha

శరద్ పవార్ కు బిగ్ షాక్.. ఎన్సీపీ అజిత్ పవార్ దేనన్న ఈసీ..

దక్ష న్యూస్, హైదరాబాద్: పిబ్రవరి 7

శరద్ పవార్ కు బిగ్ షాక్ తగిలింది. అజిత్ పవార్ వర్గానిదే అసలైన ఎన్సీపీ ( ncp ) అని ఈసీ తీర్పునిచ్చింది. అదేవిధంగా ఎన్సీపీ ఎన్నికల గుర్తు గడియారంను కూడా అజిత్ పవార్ ( ajit pawar ) వర్గానికే కేటాయించింది. గతంలో శివసేన పార్టీలో చెలరేగిన సంక్షోభం, ప్రస్తుతం నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లోనూ అలాంటి పంచాదీ మొదలైంది. శివసేన తరహాలోనే ఎన్సీపీలోనూ రెండు వర్గాలుగా చీలాయి. ఒకటి ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ వర్గం కాగా, రెండోది ఆయన సోదరుడి కుమారుడు అజిత్ పవార్ వర్గం. ఎవరికి వారు తమదే అసలైన ఎన్సీపీ అని చెప్పుకుంటూ వచ్చారు.

Hospital

Read also: త్వరలో గ్రూపు-1 ..! కొత్తగా 60 పోస్టులు యాడ్..

తాజాగా ఈ వివాదాన్ని ఎన్నికల సంఘం పరిష్కరించింది. అజిత్ పవార్ ప్రస్తుతం మహారాష్ట్ర శివసేన-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. త్వరలో లోక్ సభ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఎన్సీపీని అజిత్ పవార్ కు అప్పగిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయం శరద్ పవార్ వర్గం కు మరచిపోలేని దెబ్బ. అయితే దీనిపై శరద్ పవార్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. ఎన్సీపీ ఎన్నికల గుర్తు గడియారంను కూడా అజిత్ పవార్ వర్గానికే కేటాయించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.