Read News in Telugu Language
adsdaksha

అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు.. మా సోదరులను చంపాలని చూస్తున్నారంటూ ఆరోపణ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : ఏప్రిల్ 16

చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే ఎంఐఎం నేత, అక్బరుద్దీన్ ఒవైసీ
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెనుదుమారం రేపుతున్నాయి. మంగళవారం పాతబస్తీలో నిర్వహించిన ఎంఐఎం ( mim ) కార్యకర్తల సమావేశంలో అక్బరుద్దీన్ ఒవైసీ ( akbaruddin owaisi ) మాట్లాడారు. మా సోదరులను అక్రమంగా జైలుకు పంపించి అక్కడ వైద్యం పేరుతో స్లో పాయిజన్ ఇచ్చి చంపేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

read also : 23వరకు జ్యుడీషియల్ కస్టడీకి కవిత .. కోర్టు ఆవరణలో కీలక వ్యాఖ్యలు..

Hospital

తాము హైదరాబాద్‌లో చాలా బలంగా ఉన్నామని, తమను ఓడించడం సాధ్యం గాక కొందరు ఇలాంటి ప్రయత్నాలు చేసేందుకు సిద్ధం అవుతున్నటు తనకు అనుమానం వస్తుందని అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా హైదరాబాద్‌లో గెలుపు ఎంఐఎందేనని తేల్చి చెప్పారు. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. ఆ పార్టీతో కలిసి పని చేస్తామని అక్బరుద్దీన్ అన్నారు. హైదరాబాద్‌లో మజ్లిస్ పార్టీని ఓడించడం ఎవరి వల్ల కాదన్నారు. ఎంత మంది రావులు, రెడ్లు కలిసినా తమ విజయాన్ని ఆపలేరు అన్నారు.

read also : 18 నుండి నామినేషన్ల స్వీకరణ.. 25 తో ముగియనున్న గడువు..

జైలుకు పంపి స్లో పాయిజన్ ఇచ్చి చంపేస్తాం అనగానే తాము బెదిరిపోయే రకం కాదని, ఇలాంటి బెదిరింపులు ఎన్నో చూశామని అక్బరుద్దీన్ అన్నారు. ఎన్నికల్లో నేరుగా తమను ఎదుర్కొని విజయం సాధించే సత్తా లేకనే ఇలాంటి పనులు చేస్తున్నారన్నారు. మరోసారి హైదరాబాద్ గడ్డపై మజ్లిస్ జెండా ఎగరు వేస్తామని చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ధీమా వ్యక్తం చేశారు. కొందరు మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ బీ టీం అని ప్రచారం చేస్తున్నారని, అయితే తమను కాంగ్రెస్ నేతలే ఎక్కువ కలుస్తున్నారని ఓవైసీ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.