Read News in Telugu Language
adsdaksha

జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను వెంటనే పరిష్కరించాలి : టియుడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవి

దక్ష న్యూస్, ఖమ్మం: జూన్ 2

గత బిఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్టుల ప్రధాన సమస్య అయిన జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో అనేకమార్లు హామీలు ఇచ్చి మోసం చేసిందని టియుడబ్ల్యూజే టిజేఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ ( akuthota adinarayana ) అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఆదివారం ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు అట్టహాసంగా ఆవిష్కరించారు.
ఈ వేడుకలకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి చిర్రా రవి లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

read also : లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ కి సర్వం సిద్దం.. స్ట్రాంగ్ రూం ఉదయం గం. 5కే ఓపెన్ : జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్..

ఈ సందర్భంగా ఆదినారాయణ మాట్లాడుతూ బిఆర్ఎస్ ఆవిర్భావ సభలో నలుగురు ముఖ్యమంత్రులు, లక్షలాది మంది ప్రజల మధ్య నాటి ముఖ్యమంత్రి కేసిఆర్ నెల రోజుల్లో ఖమ్మం జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని నాటి మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, హరీష్ రావులతో కలసి హామీ ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు.

అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులను అణచివేచి మోసగాళ్లకు పదవులు ఇచ్చారని ఆదినారాయణ ఆవేదన వ్యక్తంచేశారు. గత ప్రభుత్వ తప్పిదాలే నేటి ఓటమికి కారణమని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి నెలలు గడుస్తోందని వెంటనే పరిష్కరించాలని కోరారు. లేనియెడల జర్నలిస్టులు ఇండ్ల స్థలాల పరిష్కారంకోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

Hospital

జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రా రవి మాట్లాడుతూ… తెలంగాణ అమరవీరుల త్యాగాల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ ఏర్పడిందని అందులో ముఖ్యంగా జర్నలిస్టులు, ఉద్యమ కారులు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, సకల సబ్బండ వర్గాలు ఐకమత్యంతో చేసిన పోరాట పటిమ మరువలేనిదన్నారు. అనంతరం టీయూడబ్ల్యూజే(టిజేఎఫ్) ఆధ్వర్యంలో జర్నలిస్టులు తెలంగాణ అమరవీరుల స్తూపం వద్దకు ర్యాలీగా వెళ్లి అమరవీరులకు నివాళులర్పించారు.

read also : జర సునో తెలంగాణకి కతా…

ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు టీఎస్ చక్రవర్తి, పిన్ని సత్యనారాయణ, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యదర్శి మందుల ఉపేందర్, నగర ప్రధాన కార్యదర్శి అమరవరపు కోటేశ్వరరావు, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కొరకొప్పుల రాంబాబు, కోశాధికారి బిక్కి గోపి, ఎలక్ట్రానిక్ మీడియా నగర అధ్యక్ష, కార్యదర్శులు యలమందల జగదీష్, కరీష అశోక్, మహిళ సీనియర్ జర్నలిస్ట్ వంగూరి ఈశ్వరి, భారతి, తిరుపతిరావు, వల్లూరి సంతోష్, ముత్యాల కోటేశ్వరరావు, ఉత్కంఠం శ్రీనివాస్, పి. పానకాలరావు, బండి కుమార్, వెంకట కృష్ణారావు, ఖాసీం, అంతోటి శ్రీనివాస్, యాదగిరి, నాగేశ్వరరావు, జీవన్ రెడ్డి మందుల వెంకటేశ్వర్లు, గెంటెల కుమార్, వెంకటేశ్వర్లు, వెంకట్, వెంకటేష్, పులి శ్రీను, వెంపటి నాయుడు, రమేష్, వెంకట్ రెడ్డి, ఆంజనేయులు, శ్రీధర్, శివకృష్ణ, శ్రీనివాసరావు, శ్రీనివాస్, మురళి, సంపత్, మహేష్, ఉపేందర్, యాదగిరి, గుండు శ్రీను, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.