Read News in Telugu Language
adsdaksha

జర్నలిస్టుల పిల్లలకు 50శాతం ఫీజు రాయితీ కల్పించాలి : టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవి..

దక్ష న్యూస్, ఖమ్మం: జూన్ 7

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిధి గా ఉంటూ ప్రభుత్వ పథకాలను, చట్టాలను పటిష్టంగా అమలు పరచడానికి నిరంతరం కలం కార్మికులుగా పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రయివేటు విద్యాసంస్థలలో 50శాతం ఫీజు రాయితీ కల్పించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవి అన్నారు.

శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి ఇ. సోమశేఖర్ శర్మను, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి కె. రవిబాబు ను వారి కార్యాలయాల్లో కలిసి జర్నలిస్టు లు వినతి పత్రాలు అందజేశారు.

Read also: Theenmar mallanna : మల్లన్న గెలుపు లాంఛనమే.. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో ఎలిమినేట్ అయిన బీజేపీ అభ్యర్థి…

Hospital

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవిలు మాట్లాడుతూ… ప్రజా శ్రేయస్సు దృష్ట్యా నిర్విరామంగా పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యాసంస్థల్లో 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని కోరారు. అందుకు విద్యాశాఖ అధికారులు స్పందిస్తూ జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో 50 శాతం రాయితీ కల్పించేందుకు సానుకూలంగా స్పందించారు. అందుకు అవసరమైన సర్క్యులర్ ను జారీ చేస్తామని, ప్రైవేటు, విద్యాసంస్థలు తక్షణమే జర్నలిస్టు పిల్లలకు ఫీజులో రాయితీ కల్పించాలని ప్రయివేటు విద్యాసంస్థలకు తెలియజేస్తామని హామీ ఇచ్చారు.

Read also: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ ..

కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు, యూనియన్ జిల్లా నాయకులు శెట్టి రజినీకాంత్, మందుల ఉపేందర్, భాస్కర్, టీఎస్ చక్రవర్తి, పిన్ని సత్యనారాయణ, షేక్. జానీ పాషా, తిరుపతిరావు, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కొరకొప్పుల రాంబాబు, కోశాధికారి బిక్కి గోపి, ఎలక్ట్రానిక్ మీడియా నగర అధ్యక్ష, కార్యదర్శులు యలమందల జగదీష్, కరీష అశోక్, మహిళా జర్నలిస్ట్ వంగూరి ఈశ్వరి, భారతి, ముత్యాల కోటేశ్వరరావు, ఉత్కంఠం శ్రీనివాస్, నాగరాజు, పి. పానకాలరావు, బండి కుమార్, తోట గణేష్, అంతోటి శ్రీనివాస్, వెంకట కృష్ణారావు, యాదగిరి, అప్పారావు, ఇస్సంపల్లి వెంకటేశ్వర్లు, నగేష్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.