Read News in Telugu Language
adsdaksha

all india services : సివిల్స్ ‘ప్రిలిమినరీ పరీక్ష వాయిదా.. ఇదే కొత్త తేదీ….

దక్ష న్యూస్, హైదరాబాద్ : మార్చి 19

యుపీఎస్సీ, సివిల్ సర్వీసెస్, ఫారెస్ట్ సర్వీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక. ఆల్ ఇండియా సర్వీసెస్‌ ( all india services ) లో పోస్టుల భర్తీకి నిర్వహించే యుపిఎస్‌సి ( upsc ) సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష, ఫారెస్ట్ సర్వీస్ స్క్రీనింగ్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ముందుగా ప్రకటించిన రెండు నోటిఫికేషన్ల ప్రకారం ప్రిలిమినరీ పరీక్షను మే 26న నిర్వహించాల్సి ఉంది. అయితే లోక్‌సభ ఎన్నికల కారణంగా ఈ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని యూపీఎస్సీ(UPSC) నిర్ణయించింది.

Hospital

read also : ఎన్నికల నిర్వహణ సజావుగా సాగాలి : ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్..

అలాగే ఈ రెండు పరీక్షలను జూన్ 16న నిర్వహించాలని నిర్ణయించినట్లు యూపీఎస్సీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. పౌర సేవల్లో 1,056 ఉద్యోగాలు, ఫారెస్ట్ సర్వీసెస్‌లో 150 పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 14న యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తు గడువు మార్చి 6. యుపీఎస్సీ మెయిన్స్ అక్టోబర్ 19న జరుగనుంది. లక్షల మంది డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారు.

Leave A Reply

Your email address will not be published.