Read News in Telugu Language
adsdaksha

amith shah : కేంద్ర మంత్రి పర్యటనకు పటిష్ట బందోబస్తు.. కలెక్టర్ వి.పి. గౌతమ్..

దక్ష న్యూస్, ఖమ్మం: ఆగస్ట్ 26

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( amith shah ) పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఖమ్మం జిల్లా ( khammam district ) కలెక్టర్ వి.పి. గౌతమ్ ( collector v.p. gautham ) అన్నారు. శనివారం కలెక్టర్, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్, సీఆర్పీఎఫ్ కమాండెంట్ ధరమ్ వీర్ జాఖర్ లతో కలిసి సర్దార్ పటేల్ స్టేడియంలో కేంద్ర హోంమంత్రి పర్యటన ఏర్పాట్లను అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సంబంధిత అధికారులు పర్యటన పూర్తయ్యేవరకు అందుబాటులో ఉండాలన్నారు. వైద్యులు, అన్ని సదుపాయాల అంబులెన్స్, ఫైర్ ఇంజన్, కావాల్సిన వాహనాలు స్పెర్ తో సహా సిద్ధం చేయాలన్నారు. పటిష్ట కార్యాచరణ చేసి, అమలు చేయాలన్నారు.

Hospital

read also : telangana : తెలంగాణ లో రేపు అమిత్ షా పర్యటన..

అమిత్ షా పర్యటనలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సహా సన్నద్ధం కావాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్ష లో అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, అదనపు డిసిపి ఏ.సీ. బోస్, ట్రాన్స్కో ఎస్ఇ సురేందర్, జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డా. బి. మాలతి, జిల్లా రవాణాధికారి కిషన్ రావు, ఖమ్మం ఆర్డీవో జి. గణేష్, జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు, సీఆర్పీఎఫ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.