Read News in Telugu Language
adsdaksha

ఏ పీ అంగన్వాడీల సమ్మె పై ఎస్మా..

దక్ష న్యూస్, విజయవాడ: జనవరి 7

– నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం..

జీతాల పెంపు, గ్రాట్యుటీ పెంపుతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 26 రోజులుగా ఏ పీ లో అంగన్‌వాడీలు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే.

అంగన్వాడీ సంఘాలతో ప్రభుత్వం దఫ దఫాలుగా చర్చలు జరిపినా, ఆ చర్చలు అంగన్వాడీల సమ్మె ను విరమింపజేయలేకపోయాయి.

Read also: పారిశ్రామిక అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్- 2050

Hospital

మరో వైపు ప్రభుత్వం, ఖజానాపై ఆర్థిక భారం పడని వాటికి మాత్రమే హామీ ఇచ్చిందని, జీతాల పెంపు పై అంగన్వాడిలకు, ఎలాంటి హామీ ఇవ్వకపోవడం తో, అంగన్‌వాడీ వర్కర్లు సమ్మె విరమించలేదు.

దీంతో, శనివారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, 2013 జాతీయ ఆహార భద్రత చట్టంలోని సెక్షన్ 39 కింద అంగన్వాడీలు అత్యవసర సేవల పరిధికి వస్తారని, అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ ను జారీ చేసింది.
ఆరు నెలల పాటు ఎలాంటి సమ్మెలు, ఆందోళనలు చేయొద్దని ఆదేశాల్లో పేర్కొంది.
ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి సమ్మెను కొనసాగిస్తే అంగన్వాడీలను డిస్మిస్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.

Read also: సంక్రాంతికి 4484 ప్రత్యేక బస్సులు నడపనున్న టిఎస్ ఆర్టీసి..

సమ్మెలో ఉన్నవారిపై ప్రాసిక్యూషన్‌కు అవకాశం ఉంటుంది. అయితే అన్ని డిమాండ్ లు పరిష్కారం అయ్యే వరకు సమ్మె ఆపేది లేదని అంగన్వాడీలు స్పష్టం చేశారు. జీతాల పెంపు, గ్రాట్యుటీపై పట్టుబడుతూ అంగన్వాడీలు సమ్మెను కొనసాగిస్తున్నారు. సమ్మె కొనసాగించం వలన ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వం అంగన్వాడీలకు వివరించింది. అయినా వారు సమ్మె విరమించకపోవటంతో..ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది.

Leave A Reply

Your email address will not be published.