Read News in Telugu Language
adsdaksha

ఖాకీల కక్కుర్తి..! గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఏపీ పోలీసులు..

దక్ష న్యూస్, హైదరాబాద్: ఫిబ్రవరి 2

దొంగలను పట్టుకోవాల్సిన ఖాకీలే దొంగతనం చేస్తూ పట్టుబడ్డారు. కాసులకు కక్కుర్తి పడి గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టు బడ్డారు. ఆంధ్రప్రదేశ్  ( andhrapradesh ) కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు హైదరాబాద్ ( hyderabad ) లో గంజాయి స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయారు. నౌకరుకు వెళ్లకుండా డుమ్మాకొట్టి మరీ దందా చేస్తుండ్రు. పైసలు సంపాదించాలనే ఆశతో కారులో ఏపీ నుంచి తెలంగాణకు గంజాయి అక్రమ రవాణా చేస్తూ శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ పోలీసుల చేతికి చిక్కారు.

Read also: తెలంగాణను పునర్‌‌ నిర్మిద్దాం : ఐపీఎస్​ ఆఫీసర్ల గెట్‌ టు గెదర్‌‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి..

ఇప్పుడు ఈ ఘటన షోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైదరాబాద్ నగర శివారులోని బాచుపల్లిలో ఇద్దరు వ్యక్తులు గంజాయి అమ్మడానికి ప్రయత్నిస్తున్నట్లు బాలానగర్ ఎస్ఓటీ పోలీసులకు వచ్చిన సమాచారంతో తనిఖీ చేపట్టారు. వాహనాన్ని (ఏపీ39క్యూహెచ్‌ 1763) ఆపి పరిశీలించగా 11 ప్యాకెట్లలో 22 కేజీల గంజాయి దొరికింది. దీని విలువ రూ.8 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఏపీలోని కాకినాడకు చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ గంజాయి తరలిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు… ఇద్దరి నుండి 22 కిలోల గంజాయి పట్టుకున్నట్టు ఎస్ఓటీ పోలీసులు వెల్లడించారు.

Hospital

Read also: రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి బంఫర్ ఆఫర్..

ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నామని ఎస్ఓటీ పోలీసులు తెలిపారు. విచారణ కోసం వారినీ బాచుపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్రమ వ్యాపారస్తులను పట్టుకోవాల్సిన పోలీసులే గంజాయి బిజినెస్ చేస్తుండడం పై తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.