Read News in Telugu Language
adsdaksha

అంగన్వాడి టీచర్లకు హెల్పర్లకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్..

దక్ష న్యూస్, ఖమ్మం: సెప్టెంబర్ 12

అంగన్వాడి టీచర్లకు హెల్పర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ ( cm kcr ) శుభవార్త చెప్పారు. అంగన్‌వాడీ టీచర్లు, మినీ అంగన్‌వాడీ టీచర్లు ( anganwadi teacher ), అంగన్‌వాడీ హెల్పర్‌లకు ఏప్రిల్ 30 నాటికి 65 ఏళ్ల వయస్సును నిర్దేశిస్తూ జీవో ( GO ) జారీ చేశారు. ఉద్యోగ విరమణ చేసే అంగన్‌వాడీ టీచర్లకు ప్రత్యేక ఆర్థిక సాయం కింద అంగన్‌వాడీ టీచర్‌లకు రూ.1,00,000/- రూపాయల లు, మినీ అంగన్‌వాడీ టీచర్లు, అంగన్‌వాడీ హెల్పర్‌లకు రూ.50,000/- అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం జివోలో పేర్కొంది. అంగన్ వాడి టీచర్లకు, హెల్పర్ లకు 50 ఏండ్ల వరకు 2లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ సౌకర్యం, 50 ఏండ్లుదాటిన వారికి 2 లక్షల రూపాయల ఏక్స్ గ్రేషియా ప్రకటించింది. అంగన్వాడీలకు వర్క్ ప్రెజర్ తగ్గించే విధంగా యాప్ సింప్లిఫైడ్ చేస్తాం అని ఈ సందర్భంగా సీఎం వెల్లడించారు.

read also : జంగల్ బచావో – జంగల్ బడావో నినాదాన్ని చిత్తశుద్దితో అమలు చేయాలి.. సీఎం కేసిఆర్

దేశంలోనే అంగన్‌వాడీలు చేస్తున్న సేవలకు గుర్తింపు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ ( telangana ) అని సీఎం పేర్కొన్నారు. అంగన్‌వాడీలకు తెలంగాణలోనే అత్యధిక వేతనాలు ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత మూడు సార్లు అంగన్‌వాడీల వేతనాల పెంచామని అన్నారు. అంగన్వాడీలకు శుభవార్త అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ( puvvada ajay kumar ) ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Hospital

దురదృష్టవశాత్తు సర్వీస్ లో ఉన్న అంగన్వాడీ టీచర్లు మరణిస్తే తక్షణ సాయం కింద 20,000 లు, హెల్పర్లుకు 10 వేలు సాయం అందజేసేలా ప్రభుత్వం జీవో లు జారిచేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ గారు మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీలకు పెద్ద పేట వేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్రంలో అంగన్‌వాడీ టీచర్లకు రూ.13,650, మినీ అంగన్‌వాడీ టీచర్లకు రూ.7,800, హెల్పర్లకు రూ.7,800 చొప్పున వేతనాలు ఇస్తున్నామన్నారు.

read also : ఖమ్మం నాఇల్లు.. ఇక్కడి ప్రజలు నాకుటుంబ సభ్యులు..

మహిళలు, శిశువుల ఆరోగ్యం కోసం తల్లి తర్వాత తల్లిలాగా సేవలందిస్తున్న అంగన్‌వాడీలను అంతే గౌరవంగా చూస్తూ మన ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి అన్ని విధాల ప్రాధాన్యత ఇస్తున్నారన్నారని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం మహిళల సాధికారత, సమగ్ర సేవల , రక్షణ, పోషణ, ఆరోగ్యం కోసం దేశంలోనే అత్యుత్తమంగా పనిచేస్తోందన్నారు.

 

 

 

Leave A Reply

Your email address will not be published.