Read News in Telugu Language
adsdaksha

కుల గణన చెయ్యకపోవడం వెనుక కాంగ్రెస్, బిజెపి కుట్ర దాగి ఉంది : కె.పర్వతాలు..

దక్ష న్యూస్, ఖమ్మం : మే 8

ఈ దేశంలో ఉన్న పార్టీలన్నీమతోన్మాద, కుల ఉన్మాద పార్టీలే అని బహుజన కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.పర్వతాలు అన్నారు. బుధవారం ఖానాపురం హవేలీ లోని పూలే అంబేడ్కర్ అధ్యయన వేదిక కార్యాలయంలో పి ఆర్ దేవి అధ్యక్షతన ఆంతోని సురేష్ విజయాన్ని ఆకాంక్షిస్తూ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 65 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో దళిత బహుజన జాతులకు ఒరిగిందేమిలేదన్నారు. కుల గణన చెయ్యకపోవడం వెనుక కాంగ్రెస్, బిజెపి కుట్ర దాగి ఉందని అన్నారు. అణగారిన కులాలకు ఆర్థిక రాజకీయ హోదా హోదా వస్తే వారి ప్రాధాన్యత తగ్గుతుందని.. కనుక వారిని మభ్యపెడుతు వారి ఓట్లతో గద్దెనెక్కుతూ ఎనలేని సంపదను పోగు చేసుకున్నారని విమర్శించారు.

80% ఉన్న ప్రజలకు పేదరికాన్ని మాత్రమే మిగిల్చారని పర్వతాలు అన్నారు. ఈ అగ్రవర్ణ పార్టీలు బహుజన జాతులకు చేసింది ఏమి లేదని అన్నారు . అందుకే దళిత బహుజన రాజ్యం కోసం బహుజన మేధావివర్గం ఆలోచన చేయాలని, బహుజన రాజ్యం రావాలంటే బహుజన అభ్యర్థులను గెలిపించుకొని పార్లమెంటుకు పంపడం వల్లనే మన సమస్యలు పరిష్కారమైతాయని అన్నారు.

read also : తెలంగాణ ఉద్యమకారులకు అండగా ఉంటాం.. కై కొండాయిగూడెం ఆత్మీయ సమ్మేళనంలో రఘురాం రెడ్డి..

Hospital

పార్లమెంట్ అభ్యర్థి ఆంటోనీ సురేష్ మాట్లాడుతూ ఎస్సీ లోని ఉపకులమైన డక్కలి కులానికి చెందినవాడినని అన్నారు. ప్రజలు పడే బాధలు కష్టాలు కన్నీళ్లు అన్నీ తనకు తెలుసునని, నన్ను పార్లమెంటుకు పంపితే ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీల బతుకుల మార్పు కొరకు గళం విప్పుతానని అన్నారు. బహుజన కమ్యూనిస్టు పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి పోడకండి రాంబాబు మాట్లాడుతూ, కారం చెడులో దళితుల్ని చంపిన కమ్మ కులపు నెత్తురు చుండూరులో దళితుల్ని చంపిన రెడ్ల నెత్తురుకు సంబంధించిన అభ్యర్థులే ఖమ్మం గడ్డమీద పోటీ పడుతున్నారు.

మన అయ్యలను అన్నలను చంపిన ఈ దుర్మార్గపు కులాల అభ్యర్థులను రాజకీయ సమాధి చేసేందుకు దళిత బహుజనులు ఆలోచన చేయాలన్నారు. బిఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే వారి ఆస్తులను, వారి కులాన్ని కాపాడుకుంటారని అన్నారు. బహుజన బిడ్డ ఆంథోనీ సురేష్ కి ఓటేస్తే బహుజన గొంతుకై నిలుస్తాడన్నారు. 100 ఏళ్లుగా కమ్మలు, రెడ్లు చేసిన ఆర్థిక దోపిడీ కి పేద ప్రజలు బలయ్యారన్నారు. బహుజనులు ఐక్యమై బహుజన రాజ్యం సాధించుకుందాంమన్నారు. మాల హక్కుల పోరాట సమితి మాల గుతుపదెబ్బ రాష్ట్ర అధ్యక్షులు ధార వెంకయ్య మాట్లాడుతూ, మాల జాతి ప్రజలందరూ ఆంటోనీ సురేష్ కి మొదటి ఇవ్వాలని కోరారు.

read also : సింగిల్ హ్యాండ్ కి ఓటేయండి.. ఆర్ఆర్ఆర్ ని గెలిపించండి : సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్ ..

డక్కలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కర్నే రామారావు మాట్లాడుతూ, మా కులాన్ని గుర్తించిన బహుజన కమ్యూనిస్టు పార్టీకి అభినందనలు తెలియజేస్తూ కత్తెర గుర్తుపై అన్ని బహుజన కులాల వారు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మారేలు దానెలు , మధు , సత్యవతి , తోటపల్లి శ్రీను తదిరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.