Read News in Telugu Language
adsdaksha

డిప్యూటీ సీఎంల నియామకం విరుద్ధం కాదు .. వేతనాలు ఇతర అలవెన్సులు ఉంటాయని సుప్రీం క్లారిటీ ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : ఫిబ్రవరి 13

రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎంల నియామకాలను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టు లో నమోదైన పిటిషన్ ఆ కోర్టు కొట్టివేసింది. డిప్యూటీ సీఎంల నియామకం రాజ్యంగ ఉల్లంఘన కాదని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. పలు రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎంలను నియమించడాన్ని సవాల్ చేస్తూ ప్రజాప్రయోజన వ్యాజ్యం గా సుప్రీంలో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఇది రాజ్యాంగ విరుద్ధమేమీ కాదని వెల్లడించింది. సంకీర్ణ ప్రభుత్వంలోని లేదా పార్టీలోని సీనియర్ నేతలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడానికి చాలా రాష్ట్రాలు డిప్యూటీ సీఎంలను నియమించే పద్దతిని అవలంభిస్తున్నాయని పేర్కొంది.

Hospital

read also : 12 మంది ఐపీఎస్ ల బదిలీ.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ ..

అయితే అది కేవలం పేరు మాత్రమేనని, డిప్యూటీ సీఎంగా ఎవరిని నియమించినా.. కేబినెట్ మంత్రి హోదాలోనే ఉంటారని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి డిప్యూటీ సీఎం మొట్టమొదటి మంత్రిగా ఉంటారని, ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందకు రాదని సీజేఐ స్పష్టం చేసింది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఒకరి కంటే ఎక్కువ ఉప ముఖ్యమంత్రులను నియమించిన సందర్భాలు లేకపోలేదు. ముఖ్యమంత్రికి సహాయ సహకారాలు అందించేందుకు, సీనియర్లకు తగిన ప్రాధాన్యం కల్పించేందుకు చాలా రాష్ట్రాలు డిప్యూటీ సీఎంలను నియమిస్తుంటాయి. కొన్ని రాష్ట్రాల్లో ఒకరి కంటే ఎక్కువ ఉపముఖ్యమంత్రులు ఉన్న సందర్భాలున్నాయి. అయితే, వారికి కేబినెట్ మంత్రి హోదాలోనే వేతనం, ఇతర సదుపాయాలు అందిస్తారు.

Leave A Reply

Your email address will not be published.