Read News in Telugu Language
adsdaksha

దేశంలోనే యువరాష్ట్రం తెలంగాణ ..

తెలంగాణకు హరితహారం ద్వారా అటవీ శాఖకు దేశ వ్యాప్త గుర్తింపు..

దేశంలోనే యువ రాష్ట్రంగా ఉన్న తెలంగాణకు దక్కుతున్న ఘనత, గుర్తింపుల్లో అటవీ శాఖ కూడా ఉండటం చాలా గొప్ప విషయం అని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్ & హెచ్ఓఎఫ్ఎఫ్ pccf hoff ) ఆర్.ఎం. డోబ్రియాల్ ( r.m. dobriyal ) అన్నారు.

Hospital

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మంగళవారం అరణ్య భవన్ ( aranya bhavan ) లో జరిగిన వేడుకల్లో అధికారులు, ఉద్యోగుల సమక్షంలో ఆయన జాతీయ జెండా ఎగుర వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశ విముక్తి కోసం ప్రాణాలు కోల్పోయిన వారందరినీ స్మరించుకోవటం, దేశంతో పాటు రాష్ట్ర అభివృద్దిలో ప్రతీ ఒక్కరూ పాలుపంచుకోవటం సమర యోధుల త్యాగాలకు దక్కే నిజమైన గుర్తింపు అన్నారు.

తెలంగాణ ( telangana) కు హరితహారం ( harithaharam) ద్వారా అటవీ శాఖకు దేశ వ్యాప్త గుర్తింపు దక్కిందని, ప్రతీ ఉద్యోగీ, అధికారి ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పీసీసీఎఫ్ కోరారు. గత యేడాది కాలంగా అరణ్య భవన్ లో పనిచేస్తూ ప్రతిభ కనపర్చిన ఉద్యోగులకు ఉన్నతాధికారుల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, నగదు బహుమతి అందించారు.

Leave A Reply

Your email address will not be published.