Read News in Telugu Language
adsdaksha

కేజ్రీవాల్ సీఎంగా రాజీనామా చేయరు.. జైలు నుంచే సర్కారును నడుపుతారు : ఆప్ నేత జాస్మిన్ షా ..

దక్ష న్యూస్, న్యూ ఢిల్లీ: ఏప్రిల్ 2

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజీవాల్ ( aravind kejriwal ) కు ఏప్రిల్ 15 వరకు జుడీషియల్ కస్టడీ విధిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలివ్వడంతో ఢిల్లీ ( Delhi ) పోలీసులు ఆయనను తీహార్ ( theehar )  జైలుకు తరలించారు. దీంతో సీఎం పదవికి ఆయన రాజీనామా చేస్తారా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కీలక ప్రకటన చేసింది.

Read also: పెద్దనోట్లు 97.69 శాతం వచ్చినయ్ ..రద్దయిన రూ.2వేల నోట్లపై ఆర్‌బీఐ కీలక ప్రకటన..

అరవింద్ కేజీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోరని, జైలు నుంచే ఆయన ప్రభుత్వాన్ని నడుపుతారని ఆమ్ అద్మీ పార్టీ తెలిపింది. కేజ్రీవాల్ కు జుడీషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలిచ్చిన నేపథ్యంలో ఆయన పార్టీ కీలక నేత జాస్మిన్ షా మీడియాతో మాట్లాడారు.

Hospital

ఈ కేసులో కీలక వ్యక్తిగా ఉన్న విజయ్ నాయర్ తనకు రిపోర్ట్ చేయలేదని, తనకు బదులు మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్లకు నివేదించాడని కేజ్రీ వాల్ విచారణలో చెప్పారంటూ కోర్టుకు ఈడీ తెలపడంపై స్పందిస్తూ… ఇది బీజేపీ వ్యూహాత్మక ఎత్తుగడ అని జాస్మిన్ షా ఆరోపించారు.

Read also: వరంగల్ బరిలో కడియం కావ్య..ప్రకటించిన అధిష్టానం..

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టు అయిన కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేస్తారా లేదా అనే అంశం పై జరుగుతున్న చర్చపై ఆప్ నేత జాస్మిన్ షా స్పందించారు. కేజ్రీవాల్ ను జైలులో పెట్టినా పార్టీ చెక్కు చెదరకపోవడంతో వీరిద్దరిపై బీజేపీ గురిపెట్టిందని అన్నారు. తాను ముఖ్యమంత్రికి నివేదించబోనని అరెస్ట్ సమయంలోనే విజయ్ నాయర్ తెలిపాడని ప్రస్తావించారు. అతిషి, సౌరభ్ భరద్వాజ్లకు తాను రిపోర్ట్ చేస్తానని అప్పుడే చెప్పినప్పటికీ.. ఏడాదిన్నర తర్వాత ఈడీ ఈ అంశాన్ని ఎందుకు లేవనెత్తుతోందని ప్రశ్నించారు.

అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోరని, జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారని వారు స్పష్టం చేశారు. కేజ్రీవాల్‌ను జైల్లో పెట్టినా పార్టీ చెక్కుచెదరలేదని అన్నారు. అతిషి, సౌరభ్‌లతో పాటు మరో ఇద్దరు ముగ్గురు నాయకులను బీజేపీ టార్గెట్ చేసే అవకాశం ఉందన్నారు.

Leave A Reply

Your email address will not be published.