Read News in Telugu Language
adsdaksha

బీఆర్ఎస్ కు ఆరూరి గుడ్ బై ..బీజేపీలో చేరే ఛాన్స్…

దక్ష న్యూస్, వరంగల్ : మార్చి 17

బీఆర్ఎస్ పార్టీకి, ఆ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్ష పదవికి ఆరూరి రమేష్ ( aruri ramesh ) రాజీనామా చేశారు. ఈ మేరకు శనివారం బీఆర్ఎస్ ( brs ) పార్టీ అధినేత కేసీఆర్ ( kcr ) కు రాజీనామా లేఖను పంపారు. తన రాజీనామాను ఆమోదించాలని కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు.

Hospital

read also : కంటోన్మెంట్ బరిలో లాస్యనందిత సోదరి ..ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన లాస్య ..

పార్టీలో తనకు అవకాశాలు కల్పించిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు ఆరూరి ధన్యవాదాలు చెప్పారు. బీఆర్ఎస్ లో తనకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఆయన ఇవాళ లేదా రేపు బీజేపీ ( bjp ) లో చేరే అవకాశాలున్నాయి. బీజేపీ నుంచి వరంగల్ ( warangal ) ఎంపీ ( mp ) గా పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.