Read News in Telugu Language
adsdaksha

కేజ్రీ మరోసారి డుమ్మా.. ఐదోసారి ఈడీ సమన్లు లెక్కచేయని ఢిల్లీ సీఎం..

దక్ష న్యూస్, న్యూ ఢిల్లీ: ఫిబ్రవరి 2

దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసులో అక్కడి సీఎం అరవింద్ కేజ్రీవాల్ ( arvind kejriwal ) పాత్ర ఉందంటూ వచ్చిన ఆరోపణలపై ఈడీ ( ed ) విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆప్ అధినేత, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు 5సార్లు సమన్లు జారీ చేసింది. తమ కార్యాలయానికి వచ్చి ఎంక్వైరీకి సహకరించాల్సిందిగా నోటీసులు ఇచ్చింది. గతంలో నాలుగు సార్లు ఇచ్చిన నోటీసులను తోసిపుచ్చిన కేజ్రీ వివిధ కారణాలతో నాలుగు సార్లు కూడా విచారణకు హాజరుకాలేదు.

Read also: ఖాకీల కక్కుర్తి..! గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఏపీ పోలీసులు..

Hospital

కేజ్రీ వాల్ తాజాగా శుక్రవారం విచారణకు మరోసారి డుమ్మా కొట్టారు. ఢిల్లీ ( Delhi) లిక్కర్ పాలసీ స్కాం కేసులో కేజ్రీవాల్ విచారణకు హాజరవడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. ఈడీ చట్టవిరుద్ధంగా కేజీవాల్ కు నోటీసులు పంపిందని ఆరోపించింది. ఢిల్లీలో ఆప్ సర్కార్ ను కూలదోసేందుకు ప్రధాని మోడీ కుట్రలు పన్నుతున్నారని ఆప్ నేతలు మండిపడుతున్నారు. కమలం కుట్రలు ఢిల్లీలో సాగవని ఆప్ నేతలు వార్నింగ్ ఇచ్చారు.

Read also: తెలంగాణను పునర్‌‌ నిర్మిద్దాం : ఐపీఎస్​ ఆఫీసర్ల గెట్‌ టు గెదర్‌‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి..

ఐదోసారి కూడా ఢిల్లీ సీఎం కేజీవాల్ కు ఈడీ నోటీసులు లెక్కచేయకుండా ఉండడంతో నెక్ట్స్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఏం చేయబోతుందో వేచి చూడాలి.

Leave A Reply

Your email address will not be published.