Read News in Telugu Language
adsdaksha

బీజేపీలో చేరమన్నారు.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు..

దక్ష న్యూస్, న్యూ ఢిల్లీ: ఫిబ్రవరి 4

తనను బీజేపీలో చేరాలని ఒత్తిడి చేశారని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. భారతీయ జనతా పార్టీలో చేరితే తనపై ఎలాంటి కేసులు లేకుండా చేస్తామని ఆఫర్ చేసినట్టు ఆరోపించారు. ఆదివారం రోహిణిలో కొత్త పాఠశాల భవనాలకు శంకుస్థాపన చేసిన సందర్భంగా సీఎం కేజ్రీవాల్ మాట్లాడారు. ఇప్పటివరకు నేనేం నేరం చేయలేదు, తానెప్పుడూ బీజేపీ మోచేతి నీళ్లు తాగను, ఎవరికీ కేజ్రీవాల్ తలొగ్గడని స్పష్టం చేశారు.

Read also: కాళేశ్వరం తో లక్షల కోట్ల ప్రజాధనం నీటి పాలు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..

ఢిల్లీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెట్ లో 40 శాతం స్కూల్లు, ఆస్పత్రులకు నిధులు కేటాయిస్తుంటే బీజేపీ కేంద్ర బడ్జెట్ లో మాత్రం 4 శాతమే నిధులు కేటాయిస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఇవాళ మంచి పాఠశాలలు నిర్మించడమే మనీష్ సిసోడియా చేసిన తప్పా? మంచి ఆస్పత్రులు, మోహల్లా క్లీనిక్ లు నిర్మించడమే సత్యేంద్ర జైన్ చేసిన తప్పా? అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఆ పార్టీకి తలవంచలేదనే కారణంతోనే మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా, మరో మంత్రి సత్యేంద్రజైను జైల్లో పెట్టించారని విమర్శించారు.

Hospital

Read also: పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు 25 వేల పెన్షన్ : సీఎం రేవంత్ రెడ్డి ..

అన్ని దర్యాప్తు సంస్థలు ఆప్ నేతలవైపే చూస్తున్నాయని కేజ్రీవాల్ అన్నారు. ఆప్ సభ్యులను కొనుగోలు చేసేందుకు బీజేపీ యత్నిస్తోందన్న ఆరోపణల కేసుపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ యత్నిస్తోందని జనవరి 27న మంత్రి ఆతిశీ, సీఎం కేజ్రివాల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఒక్కో సభ్యుడికి రూ.25 కోట్లు ఇవ్వజూపినట్లు వారు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కూడా ఆఫర్ చేసినట్లు చెప్పారు. దీనిపై ప్రస్తుతం దిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Read also: యువసేవ సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష ఫ్యాడ్లు పంపిణీ..

ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ పై మరోసారి ఢిల్లీ సీఎం కేజీవాల్ ఆరోపణలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Leave A Reply

Your email address will not be published.