Read News in Telugu Language
adsdaksha

ఢిల్లీ ముఖ్యమంత్రికి మరో షాక్.. కేజ్రీవాల్‌ వ్యక్తిగత కార్యదర్శి వైభవ్ కుమార్‌ తొలగింపు ..

దక్ష న్యూస్, న్యూ ఢిల్లీ: ఏప్రిల్ 12

ఢిల్లీ ఎక్సైజ్ స్కామ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ ( arvind kejriwal ) కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆయన వ్యక్తిగత కార్యదర్శి వైభవ్ కుమార్‌ ( vaibhav kumar ) ను ఇటీవల విధుల నుంచి తొలగించారు. ఆయన నియామక ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు విజిలెన్స్ (vigilance ) శాఖ వెల్లడించింది. ఈ తొలగింపు తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.

2007లో నోయిడా పోలీసు విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేసినందుకు వైభవ్ కుమార్‌పై కేసు నమోదు చేశారు. అయితే కేజ్రీవాల్‌ పీఎస్‌ నియామకం సమయంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించలేదని విజిలెన్స్ విభాగం విచారణలో తేలింది. దీంతో ఆయనను వెంటనే విధుల నుంచి తొలగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

Read also: Haryana : హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం… అదుపు తప్పి ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా..

Hospital

‘ఈ నియామకంలో అక్రమాలు జరిగాయి. పాలనా పరంగా ఇది ఇబ్బందికర పరిణామం. ఎలాంటి ముందస్తు ధృవీకరణ, పూర్వాపరాలను తనిఖీ చేయకుండా మంత్రుల వ్యక్తిగత సిబ్బందిని నియమించడం సరికాదు. వైభవ్‌పై ఆరోపణలు తీవ్రమైనవి. వారిని విచారిస్తున్నారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకోకుండానే ఆయనను పీఎస్‌గా నియమించినట్లు విజిలెన్స్ విభాగం తమ ఉత్తర్వుల్లో పేర్కొంది. మరోవైపు మద్యం కేసుకు సంబంధించి ఏప్రిల్ 8న వైభవ్ కుమార్‌ను ఈడీ ప్రశ్నించింది.

Read also: రంజాన్ వేడుకల్లో పాల్గొన్న సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి..

ఈ పరిణామాలపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ పార్టీని పూర్తిగా నాశనం చేసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతున్నదని ఆరోపించారు. ‘‘మొదట సీఎంను తప్పుడు కేసులో అరెస్ట్ చేశారు.. ఇప్పుడు కేజ్రీవాల్‌ వ్యక్తిగత కార్యదర్శితో సహా మొత్తం సిబ్బందిని తొలగించే పని మొదలైందని ఆరోపించింది.

Leave A Reply

Your email address will not be published.