Read News in Telugu Language
adsdaksha

కేజ్రీవాల్ కు మూడోసారి నోటీసులు పంపించింన ఈడీ.. చట్ట విరుద్దమని వ్యాఖ్యనించిన ఆప్..

దక్ష న్యూస్, న్యూ ఢిల్లీ: జనవరి 3

ఈడీ తనకు నోటీసు జారీ చేయడం చట్టవిరుద్దమని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు.
ఢిల్లీ మద్యం స్కాం మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ( Arvind Kejriwal ) కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు బుధవారం మూడవసారి సమన్లు జారీ చేశారు. ఎక్సైజ్ పాలసీతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ కు విచారణ సంస్థ సమన్లు పంపింది….

read also : లోక్‌సభ ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ నేటి నుంచి సన్నాహక సమావేశాలు..

Hospital

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ జారీ చేసిన సమన్లకు ప్రతిస్పందనగా, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తాను విచారణకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అయితే ఈడీ తనకు నోటీసు జారీ చేయడం చట్టవిరుద్దమని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారం నుంచి కేజ్రీవాల్ ను తప్పించేందుకే తమ పార్టీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయడమే దర్యాప్తు సంస్థ ఉద్దేశ్యమని ఆప్ ఆరోపించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ తెలిపారు.

read also : సంక్రాంతికి 32 స్పెషల్ రైళ్లు.. ఇవిగో వివరాలు..

అర్వింద్ కేజ్రీవాల్ కు గత ఏడాది నవంబర్ 2, డిసెంబరు 21వతేదీల్లో ఈడీ రెండుసార్లు సమన్లు జారీ చేసినప్పటికీ, ఫెడరల్ ఏజెన్సీ ముందు హాజరు కావడానికి సీఎం నిరాకరించారు. రాజకీయ ప్రమేయంతోనే తనకు మూడోసారి ఈడీ సమన్లు పంపించిందని కేజ్రీవాల్ ఆరోపించారు. తనకు నోటీసులు జారీ చేయడం చట్ట విరుద్దమని దీన్ని చట్టబద్దంగానే ఎదుర్కొంటామన్నారు.

Leave A Reply

Your email address will not be published.