Read News in Telugu Language
adsdaksha

ఆటోలో అసెంబ్లీకి .. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వినూత్న నిరసన ..

దక్ష న్యూస్, హైదరాబాద్: ఫిబ్రవరి 9

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం నాడు విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ ( brs ) ఎమ్మెల్యే ( mla )లు, ఎమ్మెల్సీ ( mlc ) లు ఆటోల్లో అసెంబ్లీ ( assembly ) కి వచ్చారు. కాంగ్రెస్ ( congress ) ప్రభుత్వం మహిళలకు బస్సు ఫ్రీ పెట్టడంతో ఆటోవాలాలు నష్టపోతున్నారని నిరసన తెలిపారు. ఆటోడ్రైవర్ల విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆటోలలో వచ్చారు. హైదర్ గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీ వరకూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ ఆటోల్లో ప్రయాణించారు. ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని, వారికి నెలకు రూ.10 వేలు ఇవ్వాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ( mla harishrao ) డిమాండ్ చేశారు.

read also : బీజేపీ ఈడీని వాడుకుంటోంది.. ప్రభుత్వాలను పడగొట్టేందుకు ప్రయత్నిస్తోంది: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

Hospital

మరణించిన ఆటో కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం అందించాలని హరీష్ రావు కోరారు. అదేవిధంగా ప్లకార్డులు పట్టుకోని సభలోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.

read also : కేసీఆర్ కు హరీశ్ వెన్నుపోటు ఖాయం .. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 25 మంది టచ్ లో ఉన్నారు: మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ..

నల్ల కండువాలు వేసుకుని శాసన మండలికి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను మొదట సెక్యూరిటీ సిబ్బంది అనుమతించలేదు. కొద్దిసేపు వారితో గొడవపడిన అనంతరం వారిని పోలీసులు లోపలికి అనుమతించారు.

Leave A Reply

Your email address will not be published.