Read News in Telugu Language
adsdaksha

ATA : ఆటా ఆధ్వర్యంలో భారీ సేవ కార్యక్రమాలు..

దక్ష న్యూస్, హైదరాబాద్: డిసెంబర్ 29

 

అమెరికా తెలుగు అసోసియేషన్ ( ata )  తెలంగాణ ( telangana ) లో చేసిన సేవలు ప్రశంసనీయమని అత్యంత నిబద్దతతో వారు చేసిన కార్యక్రమాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ( kasireddy narayanareddy ) అన్నారు. ఆటా వేడుకల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా, కల్వకుర్తి నియోజకవర్గం, కడ్తల్ మండల కేంద్రంలో ఆటా ట్రస్టీ కిషోర్ గూడూరు ( kishor guuduru ) ఆర్థిక సహాయంతో పోలీస్ స్టేషన్ కు 3 లక్షల రూపాయల విలువచేసే 10 స్పీడ్ లిమిట్ బారికేడ్లు, 5 ప్రభుత్వ పాఠశాలలకు కావాల్సిన మైక్ సెట్, బ్యాండ్, బ్యాగ్స్ తదితర వస్తువులు అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ… ఎంత ఎదిగినా కన్న ఊరికి ఏదో ఒక విధంగా సేవ చేసి మన ప్రాంత రుణం తీర్చుకోవాలని అన్నారు. ఈ సహాయ కార్యక్రమాలు చేపట్టిన కిషోర్ గూడూరు ను అభినందించారు.

Read also: ఆదాయం కమ్యూనిటీ సర్టిఫికెట్ లు అవసరం లేదు..

Hospital

ఆటా సెక్రెటరీ రామకృష్ణ రెడ్డి అల మాట్లాడుతూ… ఆటా చేస్తున్న సేవ కార్యక్రమాలను వివరించారు. అలాగే కిషోర్ గూడూరు చేస్తున్న సేవలను అభినందించారు. మేము మా వంతు సహాయం చేస్తున్నాం. చేస్తున్న సహాయానికి మీరు సార్థకత చేకూర్చాలని విద్యార్థులను కోరారు.

కార్యక్రమంలో ఆటా తరుపున ట్రెజరర్ సతీష్ రెడ్డి, కాన్ఫరెన్స్ నేషనల్ కో ఆర్డినేటర్ సాయి సుధీని, పాస్ట్ ప్రెసిడెంట్ పరమేష్ భీమ్ రెడ్డి, ట్రస్టీ నరసింహారెడ్డి ద్యాసాని, మీడియా కో ఆర్డినేటర్ ఈశ్వర్ బండా, సిఐ శివప్రసాద్, ఎస్.ఐ హరిశంకర్ గౌడ్, రాష్ట్ర సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు, స్థానిక సర్పంచ్ గూడూరు లక్ష్మీ నరసింహ రెడ్డి, జెడ్పీటీసీ దశరథ్ నాయక్, ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, ఎంఈఓ సర్దార్ నాయక్, పాఠశాలల హెడ్మాస్టర్లు జంగయ్య, సుశీల, యాదయ్య, ఇంద్రారెడ్డి, రాధాకృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.