Read News in Telugu Language
adsdaksha

ata : రవీంద్రభారతిలో ఘనంగా ఆటా గ్రాండ్ ఫినాలే వేడుకలు ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : డిసెంబర్ 30

నట కీరిటి రాజేంద్ర ప్రసాద్ కు జీవిత సాఫల్య పురస్కారం అందించిన ఆటా..

తెలంగాణ కళా రూపాలతో అతిథులకు స్వాగతం పలికిన కళాకారులు..

అమెరికాలో సెటిలైన ఆటా ప్రతినిధులు తాము పుట్టి పెరిగిన తెలుగు రాష్ట్రాల్లో తమ ప్రాంతాల్లో సేవ చెయ్యడం గొప్ప విషయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన ఆటా సేవ కార్యక్రమాల ముగింపు కార్యక్రమం గ్రాండ్ ఫినాలే ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నట కీరిటి రాజేంద్ర ప్రసాద్ కు జీవిత సాఫల్య పురస్కారం అందించారు.
ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిధులుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, మాజీ మంత్రి హరీశ్ రావు, అతిథులుగా ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వెంకటరమణ రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రం అభివృద్ది చెందుతోంది..
మీ వంతు బాధ్యతగా దేశానికి సహకరించండి అన్నారు.

read aalso : రాష్ట్రంలో రూ. 2 వేల కోట్ల వ్యయంతో స్కిల్ డెవలప్మెంట్ కు టాటా అంగీకారం ..

ప్రధాని మోడీ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. వైద్య రంగంలో కూడా దేశం మంచి స్థానంలో వుందన్నారు. విదేశాల నుండి కూడా పేషంట్స్ వచ్చి ఇక్కడ వైద్యం చేయించుకుంటున్నారని, మన దేశానికి పెట్టుబడులు తీసుకురండి మీ సేవలు దేశానికి చాలా అవసరం అన్నారు. తద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడండి అని కోరారు. మరో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ,
తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ప్రభుత్వానికి మీ వంతు సహకారం అందించాలని కోరారు. గత 20 రోజులుగా ఆటా సేవలు చూస్తున్నామని మంచి కార్యక్రమాలు నిర్వహించిన ఆటా నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.

Hospital

మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ,

ఆటా వాళ్ళు వారి సేవ కార్యక్రమాలను నల్లమల ప్రాంతాలకు చేర్చారన్నారు. అంత దూరం వెళ్ళారు అంటే వాళ్లకు మన ప్రాంతం మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుందన్నారు. వారికి నా అభినందనలు ధన్యవాదాలు అంటూ..కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి సహకరించండి అని కోరారు. మిమ్మల్ని కలవడం కోసం మెట్రో ఎక్కి వచ్చానని హరీష్ రావు అన్నారు.

మన దేశ కీర్తిని ఆటా ప్రపంచ వ్యాప్తంగా చేస్తోందని కొనియాడారు. ఈ సందర్భంగా ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వెంకటరమణ రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు తదితరులు కూడా వారి సందేశాన్ని వినిపించారు.

read also : బడిలేని పంచాయతీ ఉండొద్దు.. డీఎస్సీ నిర్వహణకు ఏర్పాట్లు చేయండి..

ఈ కార్యక్రమంలో ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని, ఆటా వేడుకల చైర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ఆటా సెక్రెటరీ రామకృష్ణ రెడ్డి అల, conference కన్వినర్ కిరణ్ రెడ్డి పాశం, కో ఆర్డినేటర్ సాయి సూదిని, ఆటా కోశాధికారి సతీష్ రెడ్డి, ఆటా జాయింట్ ట్రెజరర్ రవీందర్ గూడూరు, మీడియా కో ఆర్డినేటర్ ఈశ్వర్ బండా, పాస్ట్ ప్రెసిడెంట్ కరుణాకర్ మాధవరం, ఆటా బోర్డు ఆఫ్ ట్రస్టీస్ నరసింహారెడ్డి ద్యాసాని,కిషోర్ గూడూరు కాశీ కొత్త, రఘువీర్ మరిపెద్ది, రాజ్ కక్కెర్ల, ఆటా ఇండియా కో ఆర్డినేటర్ అమృత్ ముళ్ళపూడి, సినీ నటుడు, కల్చరల్ అడ్వైజరీ లోహిత్, కో ఆర్డినేటర్ శశికాంత్, పాస్ట్ ప్రెసిడెంట్ పరమేష్ భీమ్ రెడ్డి, కరుణాకర్ ఆసిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.