Read News in Telugu Language
adsdaksha

జంగల్ బచావో – జంగల్ బడావో నినాదాన్ని చిత్తశుద్దితో అమలు చేయాలి.. సీఎం కేసిఆర్

దక్షన్యూస్, హైదరాబాద్ : సెప్టెంబర్ 11

మనం ఎంత అభివృద్ది సాధించినా, సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా ప్రకృతి పరిరక్షణ మన ప్రాథమిక ధ్యేయం అని సీఎం కేసిఆర్ ( cm kcr ) అన్నారు. పర్యావరణ పరంగా తగిన రక్షణ చర్యలు చేపట్టని ఫలితమే గ్లోబల్ వార్మింగ్ ( global warming ) రూపంలో చూస్తున్నామని అందుకే మనతో పాటు, భవిష్యత్ తరాలు కూడా ఈ పుడమిపై జీవించే హక్కును కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. అటవీ అమరవీరుల దినోత్సవం (atavi amaraveerula dinotsavam )  సందర్భంగా సోమవారం సీఎం కేసిఆర్ అటవీ సంరక్షణలో ప్రాణాలు అర్పించి అమరులైన అధికారులు, సిబ్బందికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అడవులు, పర్యావరణం, పచ్చదనం లేని సమాజాన్ని మనం ఊహించలేమన్నారు. అందుకే తెలంగాణ ఏర్పాటైన తొలినాళ్లలోనే సమతుల్య పర్యావరణం కోసం ప్రణాళికలు సిద్దం చేసుకున్నాం అని తెలిపారు.

read also : గోత్రం లోను సైన్స్ ఉంది.. అదేంటో తెలుసుకోండి..

Hospital

ఇప్పుడు దశాబ్ది తెలంగాణలో ఆ సంకల్పం ఫలితాలు చూస్తున్నాం అని సీఎం అన్నారు. అడవుల పునరుద్ధరణ, పచ్చదనం పెంపు కోసం ప్రభుత్వం సంకల్పించిన
తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి అన్ని వర్గాల మద్దతు లభించటంతో ఇవాళ మనం అద్భుతమైన ఫలితాలను చూస్తున్నాం అని పేర్కొన్నారు. హైదరాబాద్ లాంటి కాంక్రీట్ కీకారణ్యంలో కూడా ఊహించనంత పచ్చదనం పెరగడంతో అంతర్జాతీయ ఉద్యానవన ఉత్పత్తిదారుల సంఘం అందించే వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్ – 2022 హైదరాబాద్ కు దక్కిందన్నారు.

read also : 14 న ప్రెస్ టూర్ ..

ఈ దిశగా అటవీ శాఖ చేస్తున్న ప్రయత్నాలను సీఎం కేసిఆర్ ప్రశంసించారు. హరిత తెలంగాణ కోసం మన లక్షిత పచ్చదనం 33 శాతం సాధించేదాకా కలిసికట్టుగా పనిచేద్దాం అని పిలుపునిచ్చారు.
ఇదే సమయంలో అటవీ రక్షణ కోసం కార్యదీక్షతో పనిచేసిన అధికారులు, సిబ్బంది 22 మంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని, వారి అంకితభావం మనందరికీ స్ఫూర్తి దాయకం అన్నారు. అడవుల రక్షణ కోసం ఆత్మార్పణం చేసిన అమరులకు నా హృదయ పూర్వక శ్రద్ధాంజలి. వీరి ఆశయాలు సజీవంగా ఉండాలంటే ప్రభుత్వం అమలు చేస్తున్న జంగల్ బచావో – జంగల్ బడావో నినాదాన్ని చిత్తశుద్దితో మనం అమలు చేయాలన్నారు. సమాజంలోని ప్రతీ ఒక్కరూ ఆ దిశగా ప్రతిజ్ఞ తీసుకోవాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.