Read News in Telugu Language
adsdaksha

ఆకాశంలో సగం అవకాశాలు మాత్రం శూన్యం : ఆయేషా సుల్తానా ..

దక్ష న్యూస్, ఖమ్మం : ఏప్రిల్ 30

ఆకాశంలో సగం అంటూ కొనియాడబడే మహిళలు జనాభాలో సగం ఉన్నా వారికి అవకాశాలు మాత్రం శూన్యం మని రాడియన్స్ న్యూస్ పోర్టల్ అసోసియేటెడ్ ఎడిటర్ ఆయేషా సుల్తానా ( Ayesha sulthana ) అన్నారు. ఖమ్మం పాత బస్టాండ్ సమీపంలో గల శ్రీధర్ లాడ్జ్ కాన్ఫరెన్స్ హాల్లో ” ప్రపంచీకరణ సమస్యలు _ సవాళ్లు _ పోరాటాలు _ మహిళల సామాజిక బాధ్యత _ కర్తవ్యాలు ” అంశం పై ఏర్పాటు చేసిన మహిళా సదస్సు లో ఆయేషా సుల్తానా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

ప్రపంచీకరణలో భాగంగా దేశంలో అమలు పరచబడ్డ సరళీకరణ , ప్రైవేటీకరణ కారణంగా బడుగు బలహీనవర్గాలు ఆర్థికంగా చితికి పోవడం జరిగిందని ఆయేషా అన్నారు. ఆ ప్రభావం కుటుంబాలపై పడటంతో , ముఖ్యంగా మహిళలు కుటుంబ భారాన్ని పోషించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. విద్య, వైద్యం కు నోచుకోలేని దుస్తితి, రక్త హీనత, పౌష్టిక ఆహార లోపంతో సత మత మౌతున్న మహిళలకు.. ప్రపంచి కరణ ఆనేక సమస్యలు తీసుకొచ్చిందన్నారు.

Read also: అందరికీ అండగా నిలుస్తాం : రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి..

మొదటినుంచీ సమస్యలతో సహా జీవనం సాగిస్తున్న మహిళలు ఆర్థిక స్వావలంబనతో సాధికారత సాధించగలరని ఆయేషా పేర్కోన్నారు. సఖీ అడ్మిన్ సరిత మాట్లాడుతూ సమాజంలో మహిళలంటే చిన్నచూపు ఉందని , పురుషులతో సమానత్వం కోసం ఇంకా పోరుబాటలోనే మహిళలు ఉన్నారని తెలిపారు. విధి వంచిత మహిళలకు తమ సఖీ సెంటర్ ఆదుకుంటుందని , న్యాయ సహాయం, వైద్య , పోలీస్ పరంగా అండగా నిలువడం, కౌన్సిలింగ్ చేయడం , వంచితులకు న్యాయం కలిపించడం సఖీ ఉదేశమన్నారు. చిట్యాల ఐలమ్మ ముని మనవరాలు శ్వేత మాట్లాడుతూ చాకలి ఐలమ్మ వంటి వీర వనితల స్ఫూర్తిగా.. మహిళలు తెగువ చూపాలన్నారు. ప్రస్తుతం మహిళలు ఆకాశంలో ఎగిరే స్థాయిలో , వివిధ రంగాల్లో తమ ప్రతిభ కనబరిచినా… ఆడదంటే సమాజంలో అలుసగానే ఉందన్నారు. ఇలాంటి ప్రతి కూల పరిస్థితుల నేపథ్యంలో మనం మరింత పట్టు దళతో పురోగా మించాలని పిలుపు నిచ్చారు.

Hospital

మహిళా సదస్సు కు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన తెలంగాణా ఉద్యమ కారుల ఫోరం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కె వి. కృష్ణా రావు, రిటైర్ సి ఐ నాగయ్య లు మాట్లాడుతూ మహిళల సమస్యల సాధనలో తమ మద్దతు ఉంటుందని చెప్పారు. వీర నారి మణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు భూక్యా ఉపేంద్ర బాయి మాట్లాడుతూ వీర నారి మణుల ఆశయ సాధనకు పాటు పడుతుందని పేర్కొన్నారు. తొలుత చిట్యాల ఐలమ్మ , సావిత్రి భాయి పూలే, రమభాయ్ అంబేడ్కర్, ఫాతిమా షేక్ చిత్ర పటాలకు పూలమాలలు వేసి , నివాళ్ళు అర్పించారు. సభకు అధ్యక్షత వహించిన సమితి గౌరవ సలహా దారులు షేక్. నజిమా మాట్లాడుతూ మహిళలు తమ హక్కుల సాధన కోసం ఉద్యమించాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు.

అనంతరం ముఖ్య అతిథి ఆయేషా సుల్తానా తో పాటు మిగతా వక్త లను శాలువా కప్పి , ఘనంగా సన్మానించారు. ఈ సదస్సులో వీరనారీ మణుల ఆశయ సాధన సమితి ప్రధాన కార్యదర్శి మామిడాల ఝాన్సీ , నాయకులు కల్పన, చందు, బాదావత్ జ్యోతి , కలకోట స్పందన , పగిడిపల్లి నాగేశ్వరరావు, రవీందర్ నాయక్ , దీన కుమారి , కృష్ణవేణి త్రివేణి, ఉష ,బి జాన్ బి, శృతి, వనిత, బట్టు రాజేందర్ , శ్రీనివాస నాయక్ , రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.