Read News in Telugu Language
adsdaksha

బహు ముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ ఆయేషా సుల్తానా ..

దక్ష న్యూస్, ఖమ్మం: మే 15

పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. ఇది అక్షరాల నిజం… డాక్టర్ ఆయేషా సుల్తానా బహుముఖ ప్రజ్ఞత్వం ఇందుకు మంచి నిదర్శనం. ఓవైపు సామాజిక సేవా కార్యక్రమాలు , మరోవైపు సామాజిక రుగ్మతల నివారణ , నైతిక విలువల పరిరక్షణ , ఇస్లాం ప్రాథమిక సూత్రాలపై అవగాహన , బాల బాలికలలో సృజనాత్మకత నైపుణ్యాలు.. ప్రతిభా పాఠవాలను వెలికి తీయడం , మెరుగుపరచడం , మహిళా సాధికారత పై కృషి ….. డాక్టర్ ఆయేషా సుల్తానా బహుముఖ ప్రజ్ఞాత్వానికి ఇవి కొన్ని మచ్చు తునకలు మాత్రమే.

మనస్తత్వస్థ శాస్త్రం ( సైకాలజీ ) చదువుకున్నా అమె ప్రస్తుత సమాజంలో నైతిక విలువలు, ఇస్లాం మౌళిక బోధనల ద్వారా ఒక మంచి సమాజ నిర్మాణానికి కృషి చేస్తున్నారు. బాధ్యతా యుత పౌరుల ప్రపంచాన్ని ఆవిష్కరించడం తన కర్తవ్యంగా భావించి ఆదిశగా కృషి చేస్తున్నారు. పతనమవుతున్న నైతిక విలువల కారణంగానే అనేక సామాజిక రుగ్మతలు ప్రభలుతున్నాయని …. ఈ రుగ్మతలకు అడ్డుకట్టు వేయటానికి చిన్ననాటి నుండి బాలబాలికలకు మంచి చెడులపై అవగాహన కల్పించాల్సిన అవసరం , మార్గదర్శకత్వం వహించాల్సిన ఆవశ్యకత గుర్తించిన ఆమె అందుకు అనుకూలంగా ప్రణాళికబద్ధంగా … బోధనలకు శ్రీకారం చుట్టారు.

Read also: ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజానీకానికి మంత్రి తుమ్మల కృతజ్ఞత లేఖ.. .

పిల్లలకు మహిళలకు అవగాహన చైతన్యం కోసం తన తొలి అడుగును 2013లో అల్ హుదా ఇస్లామిక్ ధార్మిక పాఠశాల ( ఖమ్మం ) ఏర్పాటుతో … ఇస్లాం ప్రాథమిక సూత్రాలు మహమ్మద్ ప్రవక్త జీవితం గురించి , మంచి చెడుల ప్రభావం, నైతిక విలువల పెంపుదల అంశాలపై … 2013 నుంచి 2016 వరకు సుమారు 400 మందికి ఖమ్మంలో ఉచితంగా బోధనలు చేశారు. తన సొంత ఖర్చులతో వారి రవాణా ఖర్చులను భరిస్తూ… మహిళా సాధికారతకు సైతం కృషి చేశారు.

Hospital

ఆల్ హుదా ఆధ్వర్యంలోనే అనుబంధంగా ఆయత్ అల్ ఫరియా ఇస్లామిక్ అకాడమీ స్థాపన ద్వారా కరోనా వంటి విపత్కర పరిస్థితిలో కూడా తన లక్ష్యాన్ని వీడని ఆయేషా సుల్తానా వందలాది మంది మహిళలు, బాల బాలికలకు ఖురాన్ బోధనలు, వ్యక్తిత్వ వికాసం , ఖురాన్ తప్సీర్ , ఖసాస్ ఉల్ ఆంబియా , సీ రాహ్ కోర్సులు , రంజాన్ పూర్వ కోర్సులు, బేసిక్ అరబ్బీ గ్రామర్ , మేమోరైజేషన్ కోర్సు లతో సహా విభిన్న ప్రయోజనాత్మక , వేసవి స్వల్పకాలిక కోర్సులను ప్రారంభించారు.

పనిచేసే మహిళలకు అనువైన ప్రణాళికతో వారి సంపూర్ణ శారీరిక, మానసిక అభివృద్ధి కోసం తన కార్యక్రమాలను ఏకీకృత పరుస్తూ … ప్రత్యేకంగా పిల్లల కోసం వేసవి లో చిన్న చిన్న కోర్స్ లను డాక్టర్ ఆయేషా సుల్తానా నిర్వహిస్తూ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. విధి నిర్వహణలో ఇతర ఇస్లామిక్ ధార్మిక విద్య బోధించే మహిళలకు ఆదర్శంగా స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఫామ్ ఈ ఖురాన్ తలాష్ ఖాదర్ వంటి సిరీస్ కార్యక్రమాలు సైతం తల పెడుతూ ఆన్లైన్ లో వీటిపై పోటీలను చేపడుతూ… ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాక సౌదీ అరేబియా ,దుబాయ్ ,ఆస్ట్రేలియా , యునైటెడ్ స్టేట్స్ వంటి విదేశీ విద్యార్థులను సైతం ఆమె తన ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ప్రభావిత పరుస్తూ, ఆకట్టుకుంటున్నారు.

Read also: బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు.. ముస్లిం ఓట్లను పోలరైజ్ చేయడానికి బిజేపి ప్రయత్నిస్తోందన్న సీఎం రేవంత్ రెడ్డి..

సుమారు 300 మంది ఆన్లైన్ కోర్సుల క్లాసులకు తమ పేర్లు నమోదు చేసుకోగా 100 మంది ఇందులో ఉత్తీర్ణత సాధించి , సర్టిఫికెట్లనూ అందుకున్నారు. రచయిత్రిగా ఆయేషా సుల్తానా తన ఆంగ్ల భాష ప్రావీణ్యం నేపథ్యంలో … బియాండ్ రంజాన్ , ఇంబాడియిడ్ విస్దమ్మ్ వంటి పుస్తకాలను రచించారు. ఈ క్రమంలో ఆమె తన తాజా ప్రాజెక్ట్ ” తాలిముల్ ఇస్లాం సర్టిఫికెట్ కోర్స్ ” ను ప్రారంభించారు. ఇది పది వారాల ఆన్లైన్ ప్రోగ్రాం . సుమారు 14 సంవత్సరాల లోపు పిల్లలకు దీని ద్వారా అవసరమైన ఇస్లామిక్ జ్ఞానాన్ని అందించడం. నైతిక విలువలు , మహిళా సాధికారత , విద్యా , బాల బాలికలలో సృజనాత్మకత, సామాజిక సేవలు , సామాజిక రుగ్మతల నివారణ , ముఖ్యంగా మైనార్టీ వర్గాల అభివృద్ధి, తదితర అంశాలపై ఆమె నిబద్ధత గమనించిన అనేక సంస్థలు ఆమెకు అవార్డు లను ప్రధానం చేశాయి.

ముఖ్యంగా వెనియల్ ఫౌండేషన్ ( రిజిస్టర్ ఎం ఎస్ ఎం ఈ ) డాక్టర్ ఆయేషా సుల్తానాకు రాష్ట్ర రత్న పురస్కార్ అవార్డును ప్రకటించింది. ఉత్తమ విద్య వేత్త, ఉత్తమ విద్య… లో నిష్ణాతులకి అభించే అరుదైన గౌరవం ఎక్స్ లెంట్ రికార్డ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఆమె పేర్లు నమోదు చేయడం విశేషం. ఈ విధంగా తన బహుముఖ ప్రజ్ఞ , ప్రతిభలతో డాక్టర్ ఆయేషా సుల్తానా చేస్తున్న , చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు … మరింత విస్తృతం కావాలని , మరింత మంది మహిళలను పిల్లలను చైతన్య పర్చాలని , ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ , ఆ అల్లాను వేడుకుందాం.

Leave A Reply

Your email address will not be published.