Read News in Telugu Language
adsdaksha

అయోధ్య మహా సంప్రోక్షణ మహోత్సవానికి భారీ విరాళాలు ..

దక్ష న్యూస్, హైదరాబాద్: జనవరి 3

ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో జనవరి 22న జరిగే మహా సంప్రోక్షణ మహోత్సవానికి భారీ ఎత్తున ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రధాని, రాష్ట్రపతితో పాటు భారీ సంఖ్యలో ప్రముఖులు హాజరయ్యే ఈ కార్యక్రమానికి అంతకు మించి లక్షలాదిగా భక్తులు కూడా హాజరుకాబోతున్నారు.

మహా సంప్రోక్షణ మహోత్సవానికి వచ్చిన అందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి విరాళంగా దేశం నలుమూలల నుండి ప్రజలు కూరగాయలు, బియ్యం, ఇతర ఆహార పదార్థాలను అయోధ్యకు పంపుతున్నారు.

read also : ఇక ప్రభుత్వ బడుల్లో ఫేస్ రికగ్నైజ్ అటెండెన్స్ ..ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ

Hospital

రామ మందిర ప్రారంభోత్సవ వేడుకకు లక్షలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది కాబట్టి వారికి సరిపోయేలా భారీ ఎత్తున వంటకాలు చేయబోతున్నారు.
ఇందుకోసం ప్రత్యేకంగా వంటశాలలు కూడా నిర్మించారు. ఈ నేపథ్యంలో బియ్యం, సుగంధ ద్రవ్యాలు, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలతో సహా సుమారు 300 టన్నుల ఆహార సామగ్రీ అయోధ్యకు వస్తున్నట్లు అంచనా. ఈ సామగ్రీ అంతా అయోధ్యలోని ‘కార్యశాల’లో నిల్వ చేస్తారు.

read also : 13 నుండి అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్..

భక్తులు అయోధ్యలోకి రావడం మొదలయ్యాక వంటలు ప్రారంభిస్తారు. అప్పుడు వీటిని వాడాలని ట్రస్ట్ నిర్ణయించింది. మరోవైపు భారతీయ పురాణాలలో రాముడి మాతృభూమి అయిన రాయ్‌పూర్ నుండి కూడా బియ్యం ట్రక్కులు వస్తున్నాయి. అంతేకాకుండా మిగిలిన ప్రాంతాల నుంచి కూడా భారీ ఎత్తున ఆహార ధాన్యాలు, పదార్ధాలు వచ్చి పడుతున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు స్టోర్ చేస్తున్నారు. అయోధ్య రామాలయంలో విగ్రహాల ప్రాణప్రతిష్ట రోజు ఎవరూ ఆకలితో వెనుదిరగకుండా ట్రస్టు సభ్యులు భారీ ఏర్పాట్లు చేయిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.