Read News in Telugu Language
adsdaksha

అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు హర్షం వ్యక్తం చేస్తూ భారీ బైక్ ర్యాలీ ..

దక్ష న్యూస్, ఖమ్మం : జనవరి 21

అయోధ్యలో సోమవారం బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం ఖమ్మం కొత్త బస్టాండ్ ప్రాంతంలోని ఎన్ఎస్పి రామాలయం నుండి రామభక్తులు , విశ్వహిందూ పరిషత్, వేంకటేశ్వర, కృష్ణ మందిర్ భక్త బృందాల తో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఖమ్మం నగరం మొత్తం రామనామంతో మారుమోగింది. కాషాయ జెండాలతో జై శ్రీరామ్ నినాదాలతో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీతో నగరం కొత్త శోభను సంతరించుకుంది.

Hospital

read also : ప్రభుత్వ భూమి ఒక్క గజం కూడా వదలబోము : పొంగులేటి

భైక్ ర్యాలీ ఎన్ఎస్పి రామాలయం బస్టాండ్ , రాపర్తి నగర్ సెంటర్ , జండాల్ సెంటర్ , సాయిబాబా టెంపుల్ , ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ , మయూరి సెంటర్ , వినోద్ మహల్ , ఓల్డ్ క్లబ్ రోడ్ , రైల్వే స్టేషన్ , పాత మున్సిపాలిటీ ఆఫీస్ , జీవి మాల్ , ప్రభాస్ టాకీస్ సెంటర్ , విజయలక్ష్మి హాస్పిటల్ , గాంధీ పార్క్ , ముత్యాలమ్మ గుడి , అబ్దుల్ కలాం సెంటర్ , బోనకల్ క్రాస్ రోడ్ , చెరువు బజార్ , ఆంజనేయస్వామి , మమతా రోడ్ , ఇందిరానగర్ సెంటర్ , డిస్ట్రిక్ట్ కోర్ట్ , ఇల్లందు క్రాస్ రోడ్ , జల ఆంజనేయ స్వామి టెంపుల్ , జడ్పీ సెంటర్ , ఓల్డ్ ఎల్ఐసి ఆఫీస్ , రేవతి సెంటర్ , నరసింహస్వామి గుడి , సరిత క్లినిక్ సెంటర్ , గటయ్య సెంటర్ , ఏసీపీ ఆఫీస్ , ఎస్సార్ & బిజీఎన్ఆర్ కాలేజీ , ఇల్లెందు రోడ్ , ఎన్టీఆర్ సర్కిల్ , ఆర్టిఓ ఆఫీస్ , ఎన్ఎస్పి రామాలయం వరకు కొనసాగింది . ఈ కార్యక్రమంలో ఆత్మీయ హిందూ బంధువులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ శోభాయాత్రను విజయవంతం చేశారు

read also : బాలల సర్వతోముఖాభివృద్ధికి చొరవ చూపండి : అదనపు కలెక్టర్ మధుసూదన్ రాజు..

Leave A Reply

Your email address will not be published.