Read News in Telugu Language
adsdaksha

ప్రైవేట్ వైద్య సంస్థలు పారాహుషార్..

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ లేకపోతే ఇక కష్టమే..

– జిల్లా వైద్య ఆరోగ్య శాఖా అధికారిణి డా. బి. మాలతి..

దక్షన్యూస్, ఖమ్మం : ఆగస్ట్ 21

జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్ లు, స్కానింగ్ సెంటర్లు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ పోర్టల్ (ayushman bharat digital portal ) నందు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని  ఖమ్మం జిల్లా  ( khammam district ) వైద్య ఆరోగ్య శాఖా అధికారిణి డా. బి. మాలతి ( dr.b. malathi ) తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పోర్టల్ పై జిల్లాలో పని చేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లకు తగిన శిక్షణ ఇచ్చామని తెలిపారు. జిల్లాలో గల అన్ని ఆసుపత్రులు, ల్యాబ్ లు, స్కానింగ్ సెంటర్లు తమ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్, అడ్రస్ ప్రూఫ్, ఆసుపత్రి ఫోటో, ఆధార్ కార్డు, ఈ-మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ తో తగు కాపీలను తీసుకొని జిల్లా వైద్య ఆరోగ్య శాఖా కార్యాలయం నందు సంప్రదించి తమ ఆసుపత్రి, ల్యాబ్, స్కానింగ్ సెంటర్లను తప్పని సరిగ్గా నమోదు చేసుకొని సంబంధిత ఐ.డి. నెంబర్ పొందాలని అన్నారు.

Hospital

read also : కొత్తగూడెం ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల..

ఈ ప్రక్రియ మూడు రోజులలో పూర్తి చేసుకోవాలని డా. బి. మాలతి తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకోని ఆసుపత్రి, ల్యాబ్, స్కానింగ్ సెంటర్ల పై తగుచర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని ఐఎంఏ బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరూ ఐ.డి. పొందేలా చూడాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి తెలిపారు.

read also ; ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సిట్టింగ్ లకే సీట్లు..

Leave A Reply

Your email address will not be published.