Read News in Telugu Language
adsdaksha

కటింగ్ కోసం బిల్డింగ్ పైనుంచి దూకేశాడు.. ఆత్మహత్యకు యత్నించిన అనురాగ్ వర్సిటీ స్టూడెంట్ ..

దక్ష న్యూస్, సిద్దిపేట : ఫిబ్రవరి 8

క్లాసులో అందరి ముందు కటింగ్ చేసుకోని కాలేజీకి రావాలంటూ డీన్ మందలించినందుకు బీటెక్ స్టూడెంట్ సూసైడ్ చేసుకునేందుకు యత్నించాడు. తోటి విద్యార్థుల ముందు తనను అవమానించాడని అనురాగ్ ఇంజినీరింగ్ కాలేజీలో బుధవారం విద్యార్థి జ్ఞానేశ్వర్ రెడ్డి బిల్డింగ్ పైనుంచి దూకేశాడు.

సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చందాపూర్కు చెందిన నక్కిరెడ్డి ఘట్కేసర్ మండలం వెంకటాపూర్లోని అనురాగ్ విశ్వవిద్యాలయంలో సీఎస్ఈ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తరగతులకు ఆలస్యంగా రావడంతో పాటు ఇటీవల వచ్చిన మొదటి సెమిస్టర్ ఎగ్జామ్స్ ఫలితాల్లో అన్నింటా ఫెయిల్ అయ్యాడు. మూడు రోజుల నుంచి అధ్యాపకుడు(డీన్) వీఎస్రావు విద్యార్థికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. కటింగ్ చేయించుకోవాలని సూచించారు. బుధవారం కూడా ఇదే విషయం చెప్పాడు. తోటి విద్యార్థుల ముందు అధ్యాపకుడు మందలించాడని అవమానంగా భావించిన జ్ఞానేశ్వర్ రెడ్డి భవనం పైనుంచి నుంచి దూకాడు.

Hospital

Read also: 15 రోజుల్లో 15వేల పోలీసు ఉద్యోగాలు .. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది : సీఎం రేవంత్ రెడ్డి ..

జ్ఞానేశ్వర్‌ యూనివర్సిటీ భవనం సెకండ్ ఫ్లోర్ నుంచి దూకడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. వెంటనే తోటి విద్యార్థులు స్పందించి చికిత్స నిమిత్తం అతడిని దగ్గరలో ఉన్న నీలిమ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి ఆత్మహత్య వెనుక యాజమాన్యం వేధింపులేనని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.