Read News in Telugu Language
adsdaksha

కాంగ్రెస్ లో చేరిన బాబా ఫసియుద్దీన్ .. దీపాదాస్ మున్షి సమక్షంలో చేరిన మాజీ డిప్యూటీ మేయర్..

దక్ష న్యూస్, హైదరాబాద్: పిబ్రవరి 9

 

బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన, జీహెచ్ఎంసీ ( ghmc ) మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ కార్పోరేటర్ బాబా ఫసియుద్దీన్ ( baba fasiuddin ) ఆపార్టీకి రాజీనామా చేశారు. గురువారం సాయంత్రం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షి కాంగ్రెస్ ( congress ) కండువా కప్పి ఫసియుద్దీన్ ను పార్టీలోకి ఆహ్వానించారు. ఫసియుద్దీన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సన్నిహితుడు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌తో విభేదాల కారణంగా ఆయన బీఆర్ఎస్‌కు రాజీనామా చేసినట్టుగా తెలుస్తున్నది.

Hospital

read also : టీడీపీకి 17, కాంగ్రెస్ కు 10.. ఏపీ, తెలంగాణలో లోక్ సభ ఎన్నికలపై ఇండియాటుడే సర్వే..

రాజీనామా లేఖను ఫసియుద్దీన్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పంపించారు. ఆ లేఖలో… పార్టీ కోసం ఇరవై రెండేళ్లుగా సైనికుడిలా పని చేశానని పేర్కొన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు రక్షణ కరువైందని అన్నారు. ఇటీవల కాలంలో పార్టీ అనుసరించిన విధానాలు తనకు నచ్చలేదని తెలిపారు. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి పని చేశానని అన్నారు. అలాంటి తనపై రాజకీయంగానే కాకుండా భౌతికంగా లేకుండా దాడి చేసే కుట్ర జరుగుతోందని తెలిసిందని, ఈ విషయాన్ని వెంటనే అధిష్ఠానం దృష్టికి తీసుకు వెళ్లానన్నారు. కానీ ఎలాంటి ప్రయోజనం కనిపించలేదన్నారు. గుండెల నిండా గులాబీ జెండాతో 22 ఏళ్లు సిపాయిలా పని చేసిన తనలాంటి ఉద్యమకారుడికి మీ పార్టీలో రక్షణ కరువైందని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.