Read News in Telugu Language
adsdaksha

బీజేపీకి బిగ్ షాక్.. ఆ పార్టీకి బాబు మోహన్ రాజీనామా..

దక్ష న్యూస్, హైదరాబాద్: పిబ్రవరి 7

బీజేపీకి బాబుమోహన్‌ (Babu Mohan) రాజీనామా చేశారు. గతకొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల అసంతృప్తిగా ఉన్న ఆయన.. తాజాగా గుడ్ బై చెప్పారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో బాబు మోహన్ ఈ మేరకు ప్రకటించారు.

Read also: ఈఏపీసెట్‌ షెడ్యూల్‌ రిలీజ్ ..మే 9 నుంచి పరీక్షలు..

Hospital

పార్టీలోని గ్రూపులతో తనపై విమర్శలు చేయిస్తున్నారని బాబు మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో వరంగల్ ఎంపీ టికెట్ ను అడిగితే అందుకు అధిష్టానం ఒప్పుకోలేదన్నారు. జీవితంలో కచ్చితంగా ఒక్కసారైనా అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆందోల్ టికెట్‌ను బాబుమోహన్ కుమారుడు ఉదయ్ మోహన్‌కు ఇవ్వాలని బీజేపీ భావించింది. అయితే తమ కుటుంబంలో బీజేపీ చిచ్చు పెడుతోందని మాజీ మంత్రి ఆరోపించారు.

Read also: మధ్యప్రదేశ్‌లో భారీ పేలుడు.. బాణసంచా ఫ్యాక్టరీలో 11 మంది కార్మికులు మృతి..

మీరు నెక్ట్స్ ఏ పార్టీలో చేరతారు అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా, తాను ఇంకేమీ ఆలోచించలేదని చెప్పారు. తనను వాడుకుని బీజేపీ పొమ్మనలేక పొగ పెడ్తోందని ఆరోపణలు చేశారు. ఆందోల్ నియోజకవర్గం నుంచి 2018, 2023లో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా బాబుమోహన్ పోటీ చేశారు.

Leave A Reply

Your email address will not be published.