Read News in Telugu Language
adsdaksha

చెప్పుతో కొడతా..! సీఎం రేవంత్ పై బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు..

దక్ష న్యూస్, హైదరాబాద్: ఫిబ్రవరి 5

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ( brs ) అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ( kcr ) ను తిడితే చెప్పుతో కొడతానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమవారం మంచిర్యాలలో పార్టీ జిల్లా స్థాయి మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా బాల్క సుమన్ ( balka Suman ) ఈ కామెంట్స్ చేశారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదంటూ రేవంత్ రెడ్డి ( revanth reddy ) పై బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. కేసీఆర్‌పై రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా చెప్పు చూపించారు. కేసీఆర్‌ను లంగా అంటున్న రేవంత్ రెడ్డినే పెద్ద రండగాడు, హౌలే గాడని దూషించారు. రేవంత్ రెడ్డిని చెప్పుతో కొట్టినా తప్పులేదని సంస్కారం అడ్డొచ్చి ఆగుతున్నామన్నారు.

Hospital

Read also: తెలంగాణ సర్కార్ కూలిపోద్ది.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పదవిని బట్టి, స్థాయిని బట్టి మాట్లాడాలన్నారు. రైతుబంధు డబ్బులు అడిగితే కాంగ్రెస్ మంత్రులు రైతులను చెప్పుతో కొడతామంటున్నారన్నారు. రైతు బంధు కోసం గ‌త ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన రూ.7,700 కోట్లను మంత్రి పొంగులేటికి చెందిన రాఘ‌వ క‌న్‌స్ట్ర‌క్ష‌న్‌కి, కాంగ్రెస్ కంట్రాక్ట‌ర్ల‌ జేబుల్లోకి మళ్ళించారని బాల్క సుమన్ ఆరోపించారు. సీఎం రేవంత్ పై బాల్క సుమన్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.