Read News in Telugu Language
adsdaksha

మిడ్ మానేరు డ్యాం నిర్వాసితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి: బండి సంజయ్..

దక్ష న్యూస్, హైదరాబాద్: డిసెంబర్ 18

దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న మిడ్‌మానేరు డ్యాం ( mmd ) నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కరీంనగర్ ఎంపీ ( karemnagar ), బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ( bandi sanjay ) ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ( cm revanth reddy ) ని కోరారు. నిర్వాసితులకు హామీ ఇచ్చిన మొత్తాన్ని విడుదల చేయాలని సోమవారం సంజయ్‌ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. పెండింగ్‌లో ఉన్న ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం పరిహారం మంజూరు చేయాలని, కుటుంబ ప్యాకేజీ కింద నిధులు విడుదల చేయాలని, 18 ఏళ్లు నిండిన వారికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

read also : మేడిగడ్డపై పూర్తి వివరాలు అందజేయాలి: సీఎం రేవంత్ రెడ్డి ..

Hospital

ప్రాజెక్టు కోసం నిర్వాసితులు తమ భూములు త్యాగం చేశారని బండి సంజయ్ అన్నారు. కానీ గత ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చలేదన్నారు. నిర్వాసితులకు రూ.5.04 లక్షలతో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామని మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారని, అయితే తన హయాంలో దానిని నిలబెట్టుకోలేకపోయారని గుర్తు చేశారు. అలాగే నీలోజిపల్లి నుంచి నందిగామ, అగ్రహారం వరకు ఇండస్ట్రియల్‌ కారిడార్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కళాశాల ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

read also : ప్రభుత్వ విధానాలపై ఉద్యోగుల అభిప్రాయాన్ని కోరిన మంత్రి .. పొంగులేటి ..

Leave A Reply

Your email address will not be published.