Read News in Telugu Language
adsdaksha

అసెంబ్లీలో తిట్టుకోవద్దు.. పరేడ్ గ్రౌండ్స్ వెళ్లండి: బండి సంజయ్..

దక్ష న్యూస్, హైదరాబాద్: పిబ్రవరి 7

అసెంబ్లీ సమావేశాలు అధికార, ప్రతిపక్ష పార్టీలు తిట్టుకోవడానికి, కొట్టుకోవడానికి కాదని ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. అసెంబ్లీలో కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి సంగతి తేలుస్తాననడం, రేవంత్ రెడ్డి కేసీఆర్ నన్ను టచ్ కూడా చేయలేడంటూ ఇద్దరూ సవాల్ విసురుకోవడం సిగ్గుచేటన్నారు. అసెంబ్లీ పెట్టుకునేది ఒకరికొకరు తిట్టుకోవడానికేనా? మరి ప్రజల బతుకుల సంగతి తేల్చేదెవరు అని ప్రశ్నించారు. మీరు తిట్టుకోవాలంటే పరేడ్ గ్రౌండ్ మైదానానికి వెళ్లండి… అక్కడ తిట్టుకుంటారో, కొట్టుకుంటారో తేల్చుకోండి అని బండి ఎద్దేవా చేశారు.

Read also: బీజేపీకి బిగ్ షాక్.. ఆ పార్టీకి బాబు మోహన్ రాజీనామా..

Hospital

అసెంబ్లీని మాత్రం ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడానికి వేదికగా మార్చండి అని బండి సంజయ్ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు సూచించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటేనని, ప్రజలకిచ్చిన హమీలపై కాంగ్రెస్, గత ప్రభుత్వ తప్పిదాలపై బీఆర్ఎస్ నేతలు ప్రజల దృష్టి మళ్లించేందుకే అసెంబ్లీ వేదికగా ఒకరికొకరు తిట్టుకునే కార్యక్రమానికి తెరదీశారని అన్నారు. సర్కార్ వద్ద పైసల్లేవని, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని సాక్షాత్తు ముఖ్యమంత్రే చెప్పారని, అట్లాంటప్పుడు ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలతోపాటు మేనిఫెస్టో హామీలను అమలు చేయడానికి మీ దగ్గరున్న ప్రణాళిక ఏమిటో అసెంబ్లీ వేదికగా ప్రజల ముందుంచాలని కోరారు.

Read also: ఈఏపీసెట్‌ షెడ్యూల్‌ రిలీజ్ ..మే 9 నుంచి పరీక్షలు..

గావ్ ఛలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని రంగాపూర్ గ్రామానికి బండి సంజయ్ వచ్చారు. ఈ సందర్భంగా రెండు పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

Leave A Reply

Your email address will not be published.