Read News in Telugu Language
adsdaksha

rajakar : రజాకార్ సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వండి : సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : మార్చి 20

రజాకార్ సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ( bandi sanjay ) కోరారు. ఈమేరకు మంగళవారం రేవంత్ రెడ్డి ( revanthreddy ) కి బండి సంజయ్ లేఖ రాశారు. ఆ లేఖలో… తెలంగాణ ( telangana ) ప్ర‌జ‌ల‌కు విముక్తి క‌ల్పించి స్వేచ్ఛా వాయువును అందించేందుకు జ‌రిగిన పోరాటాలు, ర‌జాకార్ల రాక్ష‌స‌త్వంపై పోరాడి ప్రాణాలు విడిచిన యోధుల చ‌రిత్ర‌, తెలంగాణ ప్ర‌జ‌ల‌కు విమోచ‌న క‌ల్పించేందుకు ఉక్కు మ‌నిషి స‌ర్ధార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ ( sardar vallabhay patel ) చేసిన కృషిని మూవీలో అద్భుతంగా చూపించార‌ని కొనియాడారు.

Hospital

read also : కాంగ్రెస్.. పాంచ్ న్యాయ్.. 5 గ్యారంటీలతో హస్తం మేనిఫెస్టో రెడీ ..

ఇలాంటి మంచి మూవీని తీసిన వారిని ప్ర‌భుత్వ‌ప‌రంగా ప్రోత్స‌హించాల్సిన అవ‌స‌రం ఉందని లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు. థియేట‌ర్ల‌లో ప్ర‌త్యేక షోలు వేసి, పాఠ‌శాల‌, క‌ళాశాల విద్యార్థుల‌కు చూపించాల‌ని కోరారు. తద్వారా నాటి మ‌హ‌నీయుల‌ను స్మ‌రించుకోవ‌డంతో పాటు వారి పోరాటాలు నేటి త‌రానికి స్ఫూర్తిగా నిలిచే అవ‌కాశం ఉంద‌ని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.