Read News in Telugu Language
adsdaksha

3న దొడ్డి కొమురయ్య చిత్ర నిర్మాణ కమిటీ ప్రకటన : భద్రు నాయక్..

దక్ష న్యూస్, ఖమ్మం : జూన్ 1

భూమికోసం, భుక్తి కోసం,వెట్టి చాకిరి విముక్తి కోసం, తెల్ల దొరలకు ఎదురు తిరిగి తన 19 సంవత్సరాల వయసులోనే, తెలంగాణ ప్రజల స్వాతంత్రాల కోసం, తెలంగాణ ప్రజల స్వేచ్ఛ జీవితం కోసం, తన ప్రాణాలను అర్పించిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, తెలంగాణ తొలి అమరుడు, దొడ్డి కొమురయ్య జీవిత చరిత్రపై….చిత్ర నిర్మాణం తెలంగాణ రాష్ట్రంలో జరగబోతుందని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోతు భద్రు నాయక్ తెలిపారు.

దీనికిగాను పూర్తిస్థాయి ఖమ్మం జిల్లా దొడ్డి కొమురయ్య చిత్ర నిర్మాణ కమిటీ ఈనెల 3న ప్రకటించనున్నట్లు వెల్లడించారు. కమిటీలో భాగస్వామ్యం కావాలనుకునేవారు, సబండ వర్గాల కులముల ప్రతినిధిగా, మీ మీ సంఘం నుండి ఒక సభ్యులుగా ఈ కమిటీలో చేరవచ్చన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా, చిత్ర సహ -నిర్మాత, హీరో, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం వహిస్తున్న మహాలంక సేనాపతి (సాయిబాబు) హాజరవనున్నట్లు తెలిపారు.

read also : టియుడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర మహాసభల వెబ్ సైట్ ని ప్రారంభించిన మంత్రి పొంగులేటి ..

సోమవారం ఉదయం 10 గంటలకు ఖమ్మం నగరం స్థానిక చెరువు బజార్ రోడ్ నెంబర్:1 ఎల్ఐసి బిల్డింగ్ వెనుక,(గ్లోబల్ హెల్లింగ్ సెంటర్) మమతా రోడ్డు 21వ డివిజన్, దొడ్డి కొమురయ్య చిత్ర నిర్మాణ కార్యాలయం కు హాజరు కావాలని కోరారు. వివరాలకు :
బానోత్ బద్రు నాయక్
దొడ్డి కొమరయ్య చిత్ర,
నిర్మాణ కమిటీ ఖమ్మం జిల్లా చైర్మన్. 8790172884,
షేక్ అబ్దుల్ రహిమాన్
దొడ్డి కొమురయ్య చిత్ర ,నిర్మాణ కమిటీ ఖమ్మం జిల్లా కన్వీనర్ –
9652791286 నంబర్లను సంప్రదించాని కోరారు.

Hospital

భూక్యా విజయకు ఘన నివాళులు..

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సమన్వయ ( డి సి హెచ్ ఎస్ ) అధికారి డాక్టర్ బి. వెంకటేశ్వర్లు సతి మణి భూక్యా విజయ పెద్ద కర్మ శనివారం ఖమ్మం నగరం లోని వీడియోస్ కాలనిలో గల ప్రసాద్ హైట్స్ అపార్టుమెంటులో నిర్వ హించారు. ఈ సందర్భంగా పలువురు నగర ప్రముఖులు నాయకులు పాల్గొని ఆమె చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

read also : విక్రయ కేంద్రాల్లో సౌకర్యాలు మెరుగు పరచండి : అధికారులకు కలెక్టర్ ఆదేశాలు..

ఈ కార్యక్రమంలో వైరా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చంద్రావతి, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోతు బద్రు నాయక్, వీరనారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా గౌరవ అధ్యక్షురాలు షేక్ నజీమా, జిల్లా అధ్యక్షురాలు భుక్యా ఉపేంద్ర బాయి , ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర నాయకులు రాజేష్ నాయక్ నాయకులు కృష్ణ నాయక్ నందు నాయక్ , రవీందర్ నాయక్ , వీరన్న నాయక్ , శ్రీనివాస్ నాయక్ , రాంబాయి , రమేష్ , సురభి నాయక్ , వీరనారి మణుల ఆశయ సాధన సమితి నాయకులు లలితా బాయి , జయా, జ్యోతి , మైనార్టీ నాయకుడు అబ్దుల్ రెహ్మాన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.