Read News in Telugu Language
adsdaksha

4 నుండి బతుకమ్మ చీరల పంపిణీ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : అక్టోబర్ 3

జిల్లాలకు చేరిన 250 రకాల డిజైన్లు.. 1.02 కోట్ల చీరలు  ..

14 వరకు పూర్తి కావాలని సీఎస్ ఆదేశం..

తెలంగాణ ( telangana ) రాష్ట్ర ప్రభుత్వం దసరా ( dasara ) పండుగ సందర్భంగా మహిళలకు ఇచ్చే బతుకమ్మ చీరల ( bathukamma cheeralu ) ను బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.

ఇప్పటికే 80% చీరలు పంపిణీ కేంద్రాలకు చేరాయి. ఈ ఏడాది రూ.354 కోట్ల వ్యయంతో చేనేత సంఘాల ఆధ్వర్యంలో 1.02 కోట్ల చీరలను సిద్ధంచేశారు. జరీతోపాటు వివిధ రంగుల కాంబినేషన్‌తో 250 డిజైన్లలో ఆకర్షణీయంగా చీరలను తయారుచేయించారు. 2017 నుంచి 2022 వరకు 5.81 కోట్ల చీరలను ఆడబిడ్డలకు అందించారు.

Hospital

మహిళలు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే దసరా పండుగకు ఆడబిడ్డలందరూ కొత్త చీరలు ధరించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ 2017 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. నేత కార్మికులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల తదితర ప్రాంతాల్లోని నేతన్నలతో వీటిని తయారు చేయిస్తున్నారు.

read also : గ్రామ స్వరాజ్య కాంక్షకు అనుగుణంగా సీఎం కేసిఆర్ పాలన…

బతుకమ్మ పండుగ సమీపిస్తుండటంతో రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన ఆడపడుచులకు ఈ నెల 4 నుంచి చీరలను పంపిణీ చేసేందుకు టెస్కో, తెలంగాణ హ్యాండ్లూమ్స్‌శాఖ సన్నాహాలు చేస్తున్నది. ఏటా సుమారు ఒక కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ చేస్తుండగా, ఈ ఏడాది కూడా 1.02 కోట్ల చీరలను తయారుచేయించారు. చౌకధర దుకాణాల ద్వారా వీటిని పంపిణీ చేయనున్నారు.

స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా మంగళవారం సీఎస్ శాంతి కుమారి అధికారులతో నిర్వహించిన టెలీ కాన్సరెన్స్ లో ఈ నెల 14 కల్లా చీరల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Leave A Reply

Your email address will not be published.