Read News in Telugu Language
adsdaksha

బస్సు డిపోలో భారీ అగ్నిప్రమాదం.. 22 బస్సులు దగ్ధం

దక్ష న్యూస్, హైదరాబాద్ : అక్టోబర్ 30

బెంగళూరులో వెల్డింగ్ పనులు చేస్తుండగా ఘటన..

కర్ణాటక రాజధాని బెంగళూరు ( bengaluru )నగరంలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వీరభద్రగనగర్ లోని బస్ డిపో గ్యారేజ్లో బస్సులకు వెల్డింగ్ పనులు చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. పార్కింగ్ చేసిన బస్సులకు వెల్డింగ్ చేస్తున్న సమయంలో నిప్పు రవ్వలు చెలరేగి అవి అక్కడున్న మిగతా వాహనాలకు వ్యాపించడం వల్లే భారీ నష్టానికి దారితీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అగ్నిప్రమాద సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేశారు.

Hospital

read also : డాక్టర్ శీలం పాపారావు.. మనలో ఒకరు..

ప్రమాదం టైంలో అక్కడ పెద్ద ఎత్తున మంటలు, పొగలు వ్యాప్తి చెందాయి. గ్యారేజీలో మొత్తం 35 బస్సులు ఉండగా.. ఈ ప్రమాదంలో 22 బస్సులకు మంటలు అంటుకున్నట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. వీటిలో 18 బస్సులు పూర్తిగా కాలి బూడిదైనట్లు చెప్పారు. మరో నాలుగు బస్సులు మాత్రం మంటలు అంటుకొని పాక్షికంగా దెబ్బతిన్నాయని వివరించారు. గ్యారేజీ బహిరంగ ప్రదేశంలో ఉండటంతో మంటలను గమనించిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకొని మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించారని వెల్లడించారు. ఈ ప్రమాదానికి సంబంధించి స్పష్టమైన కారణాలు తెలుసుకొనేందుకు సమగ్ర దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.