Read News in Telugu Language
adsdaksha

కొత్తగూడెం ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల..

దక్షన్యూస్, కొత్తగూడెం, ఆగస్ట్ 21

ఓటర్ల ముసాయిదా జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియచేయలని భద్రాద్రి కొత్తగూడెం ( bhadradri kottagudem ) జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక (collector dr. priyanka )  సూచించారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు సోమవారం జిల్లాలోని ఐదు నియోజకవర్గాలైన పినపాక ( pinapaka ), ఇల్లందు ( yellandu), కొత్తగూడెం ( kottagudem ), అశ్వారావుపేట ( aswaraopeta ), భద్రాచలం (bhadrachalam ) నియోజక వర్గాలకు చెందిన ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో మొత్తం 928983 మంది ఓటర్లున్నట్లు చెప్పారు. వీరిలో పురుషులు 454286 మంది, స్త్రీలు 474663 మంది, థర్డ్ జండర్స్ 34 మంది, ఎన్నారైలు 42 మంది, సర్వీస్ ఓటర్లు 731 మంది ఉన్నట్లు చెప్పారు.

read also : మద్యం దుకాణాలకు 1,31,490 దరఖాస్తులు..

Hospital

ముసాయిదా ఓటరు జాభితాను ప్రతి ఓటరు పరిశీలించి అభ్యంతరాలు, తప్పోప్పుల సవరణ, లిస్టులో ఉన్నటు వంటి పేర్లపై ఆక్షేపణలు తెలియజేయాలన్నారు. అందుకు సెప్టెంబర్ 19 వరకు గడువు ఉన్నట్లు చెప్పారు. నిర్దేశించిన సమయంలోగా వచ్చిన ఆక్షేపణలను విచారణ నిర్వహించి సెప్టెంబర్ 28 వరకు పూర్తి చేసి అక్టోబర్ 4న తుది ఓటరు జాబితాను ప్రకటించడం జరుగుతందని తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించి
నూతన ఓటరు నమోదుకు ఫారం-6, తప్పోప్పుల సవరణకు ఫారం-8, ఓటరు జాబితాలోని పేర్ల పై ఆక్షేపణలు, వలస వెళ్లిన, మరణించిన వారి వివరాలు తెలపడానికి ఫారం-7 ను వినియోగించాలని కలెక్టర్ పేర్కొన్నారు.

read also : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సిట్టింగ్ లకే సీట్లు..

 

Leave A Reply

Your email address will not be published.