Read News in Telugu Language
adsdaksha

జర్నలిస్ట్ ల ఇళ్ల స్థలాకై బీఎస్పీ నిరసన దీక్ష..

దక్ష న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: సెప్టెంబర్ 13

తెలంగాణ ( telangana ) రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు మోసానికి వంచనకు గురయ్యారని, ఉద్యమ సమయంలో వెన్నుదన్నుగా ఉన్న విలేకరులను సైతం రాష్ట్ర ప్రభుత్వం మరిచిపోయిందని బీఎస్పి ( bsp ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామేష్ ( kamesh )  విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం ( bhadradri kottagudem ) జిల్లా జర్నలిస్ట్ ( journalist )  లకు తక్షణమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ స్థానిక బస్టాండ్ సెంటర్ లోని చిల్డ్రన్స్ పార్క్ వద్ద బుధవారం బీఎస్పీ పార్టీ ( bsp party ) ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకంగా ఉద్యమాన్ని ముందుకు నడిపిందన్నారు.

కొత్తగూడెం ఎమ్మెల్యే గా వనమా గెలిచాక విలేకరులకు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి నెల రోజుల్లో జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇస్తానన్నారని కామేష్ గుర్తు చేశారు. నాలుగున్నర ఏళ్ళు గడిచిన నేటికి అమలుకు నోచుకోలేదని విమర్శించారు. ఈ ఏడాది జనవరి 12న కలెక్టర్ కార్యాలయ ప్రారంభానికి విచ్చేసిన కేసీఆర్ నెల రోజుల్లో జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇస్తానని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని ఎద్దేవా చేశారు. తక్షణమే జిల్లాలో ఉన్న విలేకరులకు ఇళ్ల స్థలాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు.

read also : మైండ్ బ్లోయింగ్ ఆప్షన్ లతో వివో T2 ప్రో 5G ఫోన్..

Hospital

ఇళ్ల స్థలాల ప్రకటన చేసి దశబ్ద కాలం గడుస్తున్నప్పటికీ ఇంకా కార్యరూపం దాచలేదని, బీఆర్ఎస్ అధికారం లోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ఏఒక్కరికీ కూడా జిల్లాలో ఇంటి స్థలం ఇవ్వలేదని కామేష్ దుయ్యబట్టారు. జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడం ప్రభుత్వం దలుచుకుంటే పెద్ద కష్టతరం కాదని, కేవలం కల్లబొల్లి కబుర్లు వాగ్దానాలు ఇస్తూ పాలన సాగిస్తోందని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం తేరుకొని జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు తక్షణమే కార్యచరణ రూపొందించాలని లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సైతం పిలుపునిస్తామని హెచ్చరించారు.

read also : గోత్రం లోను సైన్స్ ఉంది.. అదేంటో తెలుసుకోండి..

బుధవారం బస్టాండ్ సెంటర్లో చేపట్టిన బీఎస్పీ రిలే దీక్షలను టీయూడబ్యూజే, ఐజేయు జిల్లా అధ్యక్షుడు ఇమ్మంది ఉదయకుమార్ ప్రారంభించారు. దీక్షలకు సీనియర్ పాత్రికేయులు పోతు రాజేందర్, నవ తెలంగాణ జిల్లా స్టాఫర్ డి.వెంకటేశ్వర్లు,మన తెలంగాణ జిల్లా స్టాఫర్ లక్ష్మణ్,తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి పీ.సూరిబాబు,జీ.వెంకటేశ్వర్లు సీఎచ్న ర్సింహారావు సుజాతనగర్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష,కార్యదర్శులు ఏజే శ్రీనివాస్, మహేష్ కునర్, నాగచంద్ర, కొండ జంపన్న మాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రవీందర్ తదితరులు తమ సంఘీభావాన్ని తెలిపారు. ఈ దీక్షలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున్ రావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు బండి రమణి తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.